Sanju Samson : ఉప్ప‌ల్‌లో బుధ‌వారం వెస్టిండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌.. భారీ మైలురాయి పై సంజూ శాంస‌న్ క‌న్ను..

విండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు సంజూ శాంస‌న్‌ను (Sanju Samson) భారీ రికార్డు ఊరిస్తోంది.

IND vs WI 4th T20 match on october 14th Sanju Samson eye on massive milestone

Sanju Samson : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఉప్ప‌ల్ మైదానంలో భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య బుధ‌వారం (అక్టోబ‌ర్ 14న‌) నాలుగో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌ను ఓ భారీ మైలురాయి ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ 2 సిక్స‌ర్లు కొడితే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన ఆరో భార‌త బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు.

టీమ్ఇండియా త‌రుపున టీ20ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శ‌ర్మ‌లు మాత్ర‌మే 100 సిక్స‌ర్లు బాదారు. వీరిలో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఒక్క‌డే 200 సిక్స‌ర్ల క్ల‌బ్‌లో ఉన్నాడు.

World Championship of Legends 2026 : యువ‌రాజ్ సింగ్ డ‌కౌట్‌.. బంగ్లాదేశ్ చేతిలో ఇండియా ఛాంపియ‌న్స్ ఓట‌మి..

2015లో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంజూ శాంస‌న్ అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 75 టీ20 మ్యాచ్‌లు ఆడ‌గా.. 28.8 స‌గ‌టుతో 1663 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు సెంచ‌రీలు, 9 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 142 ఫోర్లు, 98 సిక్స‌ర్లు బాదాడు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

* రోహిత్ శ‌ర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్స‌ర్లు
* సూర్య‌కుమార్ యాద‌వ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్స‌ర్లు
* అభిషేక్ శ‌ర్మ – 65 మ్యాచ్‌ల్లో 141 సిక్స‌ర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్స‌ర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్స‌ర్లు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్స‌ర్లు
* సంజూ శాంస‌న్ – 75 మ్యాచ్‌ల్లో 98 సిక్స‌ర్లు