IND vs WI : ఆదివారం నుంచే భార‌త్ వ‌ర్సెస్‌ వెస్టిండీస్ వ‌న్డే సిరీస్‌.. సోనీలో రాదు.. ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య (IND vs WI ) ఆదివారం (సెప్టెంబ‌ర్ 27) నుంచి మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs WI ODI series Starts from september 27th do you know where to watch

IND vs WI : భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య ఆదివారం (సెప్టెంబ‌ర్ 27) నుంచి మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలలో జరగనున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 కోసం అటు భార‌త్, ఇటు వెస్టిండీస్‌లు ఈ సిరీస్‌ను స‌న్నాహ‌కంగా ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్నాయి. సీనియర్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తిరిగి జట్టులోకి రానుండగా 50 ఓవర్ల ఫార్మాట్ కోసం ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా పిలుపు అందింది.

ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌లో విఫ‌ల‌మైన కోహ్లీ, ఆఖ‌రి వ‌న్డేలో శ‌త‌కం మిన‌హా మిగిలిన మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన రోహిత్ శ‌ర్మ‌లు వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాణించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

భార‌త్‌, వెస్టిండీస్ వ‌న్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి వ‌న్డే – సెప్టెంబ‌ర్ 27న – తిరువనంతపురం
* రెండో వ‌న్డే – సెప్టెంబ‌ర్ 30న – గౌహ‌తి
* మూడో వ‌న్డే – అక్టోబ‌ర్ 3న – న్యూ చండీగ‌ఢ్

Virat Kohli : వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్‌.. కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డులు ఇవే..

ఈ మూడు వ‌న్డేలు కూడా డే అండ్ నైట్ మ్యాచ్‌లు. భార‌త కాల‌మానం ప్ర‌కారం మధ్యాహ్నం 02:00 గంటలకు ప్రారంభమవుతాయి. మ్యాచ్‌కు అరగంట ముందు అంటే మధ్యాహ్నం 01:30 గంటలకు టాస్ వేస్తారు.

వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్ కోసం భార‌త జ‌ట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్‌0 రాహుల్ (వికెట్ కీప‌ర్‌), ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, అకిబ్ న‌బీ, య‌శ‌స్వి జైస్వాల్‌, న‌మ‌న్ ధీర్‌

భార‌త్‌తో వ‌న్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జ‌ట్టు ఇదే..

షై హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, విటెల్ లావెస్, గుడకేష్ మోతీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్.

ఈ సిరీస్‌ను ఎక్క‌డ చూడొచ్చంటే?

భార‌త్, వెస్టిండీస్ వ‌న్డే సిరీస్ ప్ర‌సార హ‌క్కుల‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉంది. కాబ‌ట్టి టీవీల్లో మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ ఛాన‌ల్ల‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానున్నాయి. ఇక ఓటీటీ విష‌యానికి వ‌స్తే.. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.