Vaibhav Sooryavanshi : చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఏకైక ఆట‌గాడు..

టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

IND vs ZIM 3rd T20 Vaibhav Sooryavanshi Creates history Achieves Huge Feat

Vaibhav Sooryavanshi : టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కేవ‌లం 31 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీని సాధించాడు. ఈ క్ర‌మంలో 16 ఏళ్ల వ‌య‌సులోపే అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు 50-ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు.

Mirabai Chanu : కామన్వెల్త్ గేమ్స్‌లో భార‌త్‌కు తొలి స్వ‌ర్ణాన్ని అందించిన మీరాబాయి చాను

ఈ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ అద‌ర‌గొట్టాడు. 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 81 ప‌రుగులు సాధించాడు. వైభ‌వ్ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు సాధించింది. ఇషాన్ కిష‌న్ (29), శ్రేయ‌స్ అయ్య‌ర్ (27), రింకూ సింగ్ (25) లు రాణించారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో బ్రాడ్ ఎవాన్స్ రెండు వికెట్లు తీశాడు. సికింద‌ర్ ర‌జా, బ్లెస్సింగ్ ముజరబాని, వెస్లీ మధెవెరే లు త‌లా ఓ వికెట్ సాధించారు

ఆ త‌రువాత 193 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగులే ప‌రిమిత‌మైంది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో ర్యాన్ బ‌ర్ల్ (54 నాటౌట్; 43 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మిగిలిన వారిలో వెస్లీ మధెవెరే (28), బెన్ క‌ర్రాన్ (20)లు ప‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌యాంక్ యాద‌వ్ మూడు వికెట్లు తీశాడు. య‌శ్ ఠాకూర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ర‌వి బిష్ణోయ్‌, అశోక్ శ‌ర్మ లు చెరో వికెట్ సాధించారు..