×
Ad

IND W vs AUS W : రెండో వ‌న్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్.. వైష్ణవి శ‌ర్మ అరంగ్రేటం

మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా శుక్ర‌వారం భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య (IND W vs AUS W ) రెండో వ‌న్డే మ్యాచ్ ప్రారంభమైంది.

IND W vs AUS W 2nd ODI India Women opt to bat 20 year old Vaishnavi Sharma debut

  • భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌హిళ‌ల మ‌ధ్య రెండో వ‌న్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్
  • 20 ఏళ్ల వైష్ణ‌వి శ‌ర్మ అరంగ్రేటం

IND W vs AUS W : మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా శుక్ర‌వారం భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే మ్యాచ్ ప్రారంభమైంది. హోబ‌ర్ట్ వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వ‌న్డే మ్యాచ్‌లో (IND W vs AUS W ) ఓడిపోయిన భార‌త్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భావిస్తోంది.

కాగా.. ఈ మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లో ఎడ‌మ చేతి వాటం స్పిన్న‌ర్ మ‌ధ్య ప్ర‌దేశ్ కు చెందిన 20 ఏళ్ల వైష్ణవి శ‌ర్మ భార‌త్ త‌రుపున అరంగ్రేటం చేయ‌నుంది.

Sikandar Raza : జింబాబ్వే కెప్టెన్ సికింద‌ర్ రజా అరుదైన ఘ‌న‌త‌..

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు..

అలిస్సా హీలీ(కెప్టెన్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, బెత్ మూనీ(వికెట్ కీపర్), అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, నికోలా కారీ, అలానా కింగ్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్

IND vs ZIM : ఓట‌మికి సాకులు చెప్ప‌డం లేదు.. ఆ ఒక్క ప‌ని చేసి ఉంటే గెలిచేవాళ్లం.. జింబాబ్వే కెప్టెన్ సికింద‌ర్ రజా కామెంట్స్‌..

భార‌త తుది జ‌ట్టు..

స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీప‌ర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, కష్వీ గౌతమ్, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, శ్రీ చరణి