IND W vs AUS W : టాస్ గెలిచిన భారత్.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్టులో మంధాన, షఫాలీతో పాటు ఎవరెవరు ఉన్నారంటే?
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత మహిళల, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య (IND W vs AUS W ) తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది.
- Thota Vamshi Kumar
- Published On : February 15, 2026 / 02:14 PM IST
IND W vs AUS W India Women opt to bowl
IND W vs AUS W : మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా భారత మహిళల, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
‘మేము మొదట ఫీల్డింగ్ చేస్తాం. ఆస్ట్రేలియాతో ఆడడాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాము. ఈ రోజు కూడా మంచి గేమ్ అవుతుందని ఆశిస్తున్నాం. ఎక్కడి వెళ్లినా కూడా టీమ్ఇండియా ఫ్యాన్స్ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు.’ అని హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది.
🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl first.
Updates ▶️ https://t.co/juV5IzNYcG#AUSvIND pic.twitter.com/JrZtgijsOs
— BCCI Women (@BCCIWomen) February 15, 2026
‘ఇది మంచి సిరీస్ అవుతుందని అనుకుంటున్నాను. సిడ్నీ వేదికగా సిరీస్‌లో తొలి మ్యాచ్ జరగుతోంది. ఇక్కడ గెలిచి శుభారంభం పొందాలని భావిస్తున్నాను. మాది చాలా మంచి జట్టు.’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్ తెలిపారు.
భారత మహిళల తుది జట్టు..
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్
ఆస్ట్రేలియా మహిళల తుది జట్టు..
బెత్ మూనీ (వికెట్ కీపర్), జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లీ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, నికోలా కారీ, సోఫీ మోలినెక్స్(కెప్టెన్), కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్
