IND vs PAK : అటు అభిషేక్ శర్మ.. ఇటు తిలక్ వర్మ.. పాక్ పై కోహ్లీ రికార్డును తొలుత అందుకునేది ఎవరో?
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు (IND vs PAK) టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Tilak Varma and Abhishek Sharma eye on Most sixes for India vs Pakistan in T20Is
IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా నేడు (ఆదివారం ఫిబ్రవరి 15న) భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
పాకిస్థాన్ పై టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమ్ఇండియా ప్లేయర్‌గా నిలిచేందుకు వీరు కాస్త దూరంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ పేరిట ఉంది.
ఇదేం కోరికరా బాబూ.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు ముందు మాజీ క్రికెటర్ వింత వ్యాఖ్యలు..
విరాట్ కోహ్లీ పాక్‌తో 11 టీ20 మ్యాచ్‌లు ఆడగా 11 సిక్సర్లు బాదాడు. ఆ తరువాతి స్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నాడు. యువీ 8 మ్యాచ్‌ల్లో 9 సిక్సర్లు కొట్టాడు. ఇక అభిషేక్, తిలక్ వర్మల విషయానికి వస్తే.. వీరిద్దరు పాక్ పై చెరో 7 సిక్సర్లు కొట్టారు. ఆదివారం కొలంబో జరగనున్న మ్యాచ్‌లో ఎవరు 5 సిక్సర్లు కొడితే.. అతడు కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడు.
టీ20ల్లో పాక్ పై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు వీరే..
* విరాట్ కోహ్లీ – 11 మ్యాచ్‌ల్లో 11 సిక్సర్లు
* యువరాజ్ సింగ్ – 8 మ్యాచ్‌ల్లో 9 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 3 మ్యాచ్‌ల్లో 7 సిక్సర్లు
* తిలక్ వర్మ – 3 మ్యాచ్‌ల్లో 7 సిక్సర్లు
* రోహిత్ శర్మ – 12 మ్యాచ్‌ల్లో 7 సిక్సర్లు
అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడలేదు. అయితే.. పాక్‌తో మ్యాచ్‌లో అతడు పాల్గొంటాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఈ రికార్డును అభిషేక్ సాధించే అవకాశం ఉంది.
