Border Gavaskar Trophy : బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీకి ముందు.. ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నున్న భార‌త్‌-ఏ.. షెడ్యూల్ ఇదే..

ఈ ఏడాది చివ‌ర్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియాతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో త‌ల‌ప‌డ‌నుంది.

India A To Play Australia A Ahead Of Border Gavaskar Trophy Schedule here

ఈ ఏడాది చివ‌ర్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియాతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్ కంటే ముందు భార‌త ఏ, ఆస్ట్రేలియా ఏ జ‌ట్లు రెండు ఫ‌స్ట్ క్లాస్ మ్యాచులు ఆడ‌నున్నాయ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ రెండు మ్యాచ్‌ల‌ను మాకేలోని గ్రేట్ బారియ‌ర్ రీఫ్ ఎరీనాలో, ఎంసీజీలో నిర్వ‌హించ‌నున్నారు.

మొద‌టి మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 31- న‌వంబ‌ర్ 3 మ‌ధ్య‌, రెండో మ్యాచ్ న‌వంబ‌ర్ 7 – 10 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ రెండు మ్యాచుల వ‌ల్ల టెస్టు సిరీస్‌లో ఎంపిక చేసే ఆట‌గాళ్ల‌ను ఇందులో ప‌రీక్షించే అవ‌కాశం ఇరు జ‌ట్ల‌కు ఉంటుంద‌ని సీఏ హెడ్ పీట‌ర్ రోచ్ తెలిపారు.

Viral Video : ఈవీడియో చూస్తే న‌వ్వ‌కుండా ఉండ‌లేరు.. ర‌నౌట్ చేసేందుకు చిన్నారుల పాట్లు.. అయ్యో పాపం

ఐదు టెస్టులు..

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త జ‌ట్టు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. న‌వంబ‌ర్ 22 నుంచి జ‌న‌వ‌రి 7 వ‌ర‌కు పెర్త్ స్టేడియం, అడిలైడ్ ఓవల్, గబ్బా, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లలోఈ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా డ‌బ్ల్యూఏసీఏ గ్రౌండ్‌లో మూడు రోజుల ఇంట్రా-స్వ్కాడ్ మ్యాచ్‌ను ఆడ‌నుంది.
కాగా.. 2017 నుంచి ఆస్ట్రేలియా జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని గెలుచుకోలేదు. 2018-19, 2020-21 సీజ‌న్ల‌లో జ‌రిగిన సిరీస్‌ల‌ను టీమ్ఇండియా విజ‌యం సాధించింది. ఈ సారి కూడా గెలిచి వ‌రుస‌గా మూడు సార్లు ట్రోఫీని అందుకున్న జ‌ట్టుగా నిల‌వాల‌ని భార‌త జ‌ట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

BCCI : టీమ్ఇండియా హెడ్‌కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమిత్ షా, స‌చిన్ టెండూల్క‌ర్‌..?

ట్రెండింగ్ వార్తలు