Smriti Mandhana : స్మృతి మంధానకు చిరాకు తెప్పించిన కెమెరామెన్.. వీడియో వైరల్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధానకు (Smriti Mandhana) ఓ కెమెరామెన్ చిరాకు తెప్పించారు.
Smriti Mandhana irritated by a cameraperson ahead of the WPL 2026 opener
- స్మృతి మంధానకు చిరాకు తెప్పించిన కెమెరామెన్
- డబ్ల్యూపీఎల్ 2026 తొలి మ్యాచ్‌కు ముందు
- మైదానంలో మంధాన ప్రాక్టీస్ చేస్తుండగా
Smriti Mandhana : శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన డబ్ల్యూపీఎల్ 2026 ఓపెనర్ మ్యాచ్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధానకు ఓ కెమెరామెన్ చిరాకు తెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో మంధాన మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ కెమెరామెన్ ఆమెను ఫోటోలు తీస్తున్నాడు. మంధాన త్రోడౌన్‌లను ఎదుర్కొంటుండగా.. సదరు కెమెరామెన్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. దీంతో మంధాన కాస్త అహసనానికి గురైంది. ఏంటి ఇది అన్నట్లుగా సైగ చేసింది. ఆ సమయంలో మంధాన ముఖంలో చిరాకు చాలా స్పష్టంగా కనిపించింది.
ఇక ఈ మ్యాచ్‌లో మంధాన 13 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మంధాన నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టు ఆఖరి బంతికి విజయం సాధించింది.
Cameraman not leaving Smrithi alone to practice and see Smrithi’s reaction 😂 pic.twitter.com/QVF8q4WTzw
— RCB (@RCBtweetzz) January 9, 2026
మ్యాచ్ అనంతరం మంధాన మాట్లాడుతూ.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. సీజన్‌లో తొలి మ్యాచే థ్రిల్లర్‌ను తలపించిందని, ఇలాంటి మ్యాచ్‌లకు ఆర్‌సీబీ పెట్టింది పేరు అని చెప్పుకొచ్చింది. ఏదీ ఏమైనప్పటికి కూడా రెండు పాయింట్లు గెలవడంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. సజీవన్ సజన (45), నికోలా కేరీ (40), జి కమలినీ (32 ) రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో నదైన్ డిక్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టింది. లారెన్ బెల్, శ్రేయాంక పాటిల్ లు చెరో ఓ వికెట్ తీశారు.
WPL 2026 : ఆమె లేకపోతే గెలిచేవాళ్లం కాదు.. ఆ రెండు పాయింట్లు.. స్మృతి మంధాన కామెంట్స్..
ఆ తరువాత నదైన్ డిక్లెర్క్ (63 నాటౌట్; 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 155 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ సరిగ్గా 20 ఓవర్లలో అందుకుంది. ముంబై బౌలర్లలో నికోలా కారీ, అమేలియా కెర్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
