Hardik Pandya : ప్రపంచకప్ వేడుకల్లో గర్ల్‌ఫ్రెండ్‌తో సరసాలు.. చిక్కుల్లో హార్దిక్ పాండ్యా.. శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆల్‌రౌండర్‌పై న్యాయవాది ఫిర్యాదు..
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చిక్కుల్లో పడ్డాడు.
- Thota Vamshi Kumar
- Updated on- March 12, 2026 / 11:10 AM IST
India all rounder Hardik Pandya is in legal trouble Complaint filed against him for insulting national flag
- చిక్కుల్లో హార్దిక్
- శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో పాండ్యా పై న్యాయవాది ఫిర్యాదు
Hardik Pandya : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తరువాత జరుపుకున్న సంబరాల్లో పాండ్యా జాతీయ జెండాను అగౌరవపరిచారని పూణేకు చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ ఆరోపించారు. ఈ మేరకు శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో పాండ్యాపై ఫిర్యాదు చేశారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ తరువాత హార్దిక్ పాండ్యా తన ఒంటికి జాతీయ జెండాను చుట్టుకుని కనిపించాడు. ఆ తరువాత తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో వేడుకలు చేసుకున్నాడు. ఇదే వివాదానికి కారణమైంది.
SRH Schedule : సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే..
న్యాయవాది వాజిద్ ఖాన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘మీరు టీ20 ప్రపంచకప్ వేడుకలను చూసే ఉంటారు. ఈ వేడుకల్లో హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి మైదానంలో డ్యాన్స్‌లు చేశాడు. ఆ సమయంలో అతడు జాతీయ జెండాను ఒంటికి చుట్టుకుని ఉన్నాడు. 1971 నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం.. మనం జాతీయ జెండా గౌరవాన్ని గౌరవించాలి. అయితే.. హార్దిక్ పాండ్యా తన విజయోత్సవ వేడుకలో మునిగిపోయాడు. అతను తన స్నేహితురాలితో కలిసి జాతీయ జెండాను ధరించి వేదికపై పడుకున్నాడు. ఇది జాతీయ జెండాకు అవమానం అని నేను నమ్ముతున్నాను.’ అని వాజిద్ చెప్పుకొచ్చారు.
ఈ విషయంపై తాను శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపాడు. తాను ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు, సంఘటన ఇక్కడ జరగలేదు కదా అని వారు అన్నారు. అయితే.. జాతీయ జెండా అనేది యావత్ దేశానికి చిహ్నం. కాబట్టి ఎక్కడైనా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చునని తాను వారికి చెప్పినట్లుగా వివరించాడు. ఆ తరువాత పోలీసులు తన ఫిర్యాదును స్వీకరించి ఓ కాపీని కూడా ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. తాను ఫిర్యాదు చేశానని, తరువాత ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.
