×
Ad

Sanju Samson : దక్షిణాఫ్రికాపై ఘోర పరాజయం.. తుది జ‌ట్టులోకి సంజూ శాంస‌న్‌..! భారత కోచ్ కీలక సూచన

ద‌క్షిణాఫ్రికా పై ఘోర ఓట‌మి నేప‌థ్యంలో శాంస‌న్‌ను తుది జ‌ట్టులో చేర్చే అంశం పై ఖ‌చ్చితంగా చ‌ర్చ‌జ‌ర‌గ‌నుంద‌ని భార‌త అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ చెప్పుకొచ్చాడు.

India coach hints at Sanju Samson inclusion after defeat to South Africa in T20 World Cup 2026

Sanju Samson : టీ20 ప్ర‌పంచ‌క‌ప 2026లో సూప‌ర్‌-8లో భాగంగా ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 76 ప‌రుగుల తేడాతో ఘోర ప‌రాజ‌యం పాలైంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో భార‌త్‌కు ఇదే అతి పెద్ద‌ ఓట‌మి (ప‌రుగుల ప‌రంగా). ఈ మ్యాచ్‌లో ఓట‌మి అనంత‌రం భార‌త అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ మీడియాతో మాట్లాడుతూ సంజూ శాంస‌న్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నాడు.

గత 18 నెలలుగా బాగా రాణించిన ఆటగాళ్లకు జట్టు మద్దతు ఇవ్వడం కొనసాగించాలా లేదా శాంస‌న్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకురావడాన్ని పరిగణించాలా అనే ప్ర‌శ్నకు ర్యాన్ ఇలా స‌మాధానం ఇచ్చాడు. చాలా జ‌ట్లు తొలి ఓవ‌ర్‌లోనే పార్ట్ టైఫ్ ఆఫ్ స్పిన్న‌ర్ల‌తో బౌలింగ్ చేయిస్తున్నాయి. కాబ‌ట్టి శాంస‌న్‌ను తుది జ‌ట్టులో చేర్చే అంశం పై ఖ‌చ్చితంగా చ‌ర్చ‌జ‌ర‌గ‌నుంద‌ని చెప్పుకొచ్చాడు. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నాడు.

Team India : ఒకే ఒక ఓట‌మి.. టీమ్ఇండియా సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతు..! మ‌హాద్భుతం జ‌ర‌గాల్సిందేనా?

ఈ మ్యాచ్‌లో భారత జట్టు చాలా తప్పులు చేసిందని ఒప్పుకున్నాడు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఫామ్‌ల పై స్పందించాడు. ‘నేను అభిషేక్ లేదా తిలక్ కోసం సాకులు చెప్పదలచుకోలేదు. అభిషేక్ కు ఫుడ్ పాయిజన్ అయింది. కోలుకుని వ‌చ్చాడు. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో డ‌కౌట్లు అయిన‌ప్పుడు ఒత్తిడి ఉంటుంది. అత‌డికి స‌రైన మార్గ నిర్దేశం చేయ‌డం మా ప‌ని. నెట్స్‌లో ల‌య గురించి మాట్లాడ‌డంలో అర్థం లేదు. మంచి ప్ర‌ద‌ర్శ‌న‌తో అన్నింటికి స‌మాధానం చెప్పాలి.’ అని ర్యాన్ టెన్ డోస్చేట్ అన్నాడు.

అక్షర్ పటేల్ కాద‌ని సుంద‌ర్‌ను తీసుకోవ‌డంపై..

వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ను కాద‌ని వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను తీసుకోవ‌డంపై కూడా ర్యాన్ టెన్ డోస్చేట్ స్పందించాడు. క్వింట‌న్ డికాక్‌, డేవిడ్ మిల్ల‌ర్, ర్యాన్ రికెల్ట‌న్‌లను వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఇబ్బంది పెడతాడ‌ని భావించి అత‌డి వైపు మొగ్గు చూపిన‌ట్లు చెప్పాడు.

IND vs SA : నిజం చెప్పొద్దు.. మేం గెల‌వ‌డానికి అదొక్క‌టే కార‌ణం.. ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్ర‌మ్ హాట్‌ కామెంట్స్‌..

‘మేము తుది జ‌ట్టు ఎంపిక గురించి చాలా చ‌ర్చించాము. ఫినిష‌ర్‌గా రింకూ సింగ్ అవ‌స‌రం అని భావించాము. అక్ష‌ర్ ప‌టేల్ నాణ్య‌మైన ఆట‌గాడు. అత‌డి ప్ర‌తిభ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఏమీ చేయ‌గ‌ల‌డో తెలుసు. కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని భావించాము. అక్ష‌ర్‌, సుంద‌ర్ ఇద్ద‌రూ కూడా ఎడ‌మ చేతి వాటం ఆట‌గాళ్లు. డికాక్‌, మిల్ల‌ర్‌, ర్యాన్ రికిల్ట‌న్‌లు ఉండ‌డంతో సుంద‌ర్ ను తీసుకున్నాము. మేము ఉత్త‌మ జ‌ట్టు ఎంపిక కోసం ప్ర‌య‌త్నించాము. ఒక‌వేళ అక్ష‌ర్ ఈ మ్యాచ్‌లో ఆడి ఉంటే.. అత‌డు సుంద‌ర్ లాగానే బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ముందుగానే ఆడేవాడు. ‘అని డోస్చేట్ అన్నారు.