Tokyo Olympics 2020: స్వర్ణ విజేత నీరజ్.. సరదాగా మొదలెడితే స్వర్ణం దక్కింది

చిన్నతనంలోనే 90ఏళ్ల బరువుతో ఊబకాయుడిగా ఉండే నీరజ్ చోప్రా స్వర్ణ విజేతగా మారాడు. హర్యానాకు చెందిన ఈ అథ్లెట్.. అద్వితీయమైన ప్రదర్శనతో భారతీయులందరినీ గర్వించేలా చేశాడు. సామాన్య కుటుంబ బ్యాక్ గ్రౌండ్ తో మొదలుపెట్టిన అతడి ప్రస్థానం దేశం మొత్తం తెలుసుకుంటుంది.

Tokyo Olympics 2020: చిన్నతనంలోనే 90ఏళ్ల బరువుతో ఊబకాయుడిగా ఉండే నీరజ్ చోప్రా స్వర్ణ విజేతగా మారాడు. హర్యానాకు చెందిన ఈ అథ్లెట్.. అద్వితీయమైన ప్రదర్శనతో భారతీయులందరినీ గర్వించేలా చేశాడు. సామాన్య కుటుంబ బ్యాక్ గ్రౌండ్ తో మొదలుపెట్టిన అతడి ప్రస్థానం దేశం మొత్తం తెలుసుకుంటుంది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబం బరువు పెరిగిన కొడుకును జాగింగ్, వాకింగ్ లాంటివి చేయమని చెప్పారు.

ప్రస్తానం మొదలైంది అక్కడే:
అలా సొంత ప్రాంతమైన హరియాణాలోని పానిపట్‌ జిల్లా ఖంద్రా గ్రామంలో మొదలైంది నీరజ్ చోప్రా ప్రస్థానం. 12 ఏళ్లకే 90కిలోల బరువు తగ్గే క్రమంలో… స్థానిక శివాజీ స్టేడియంలో జాగింగ్‌ చేయడానికి వెళ్లాడు. అక్కడే జావెలిన్‌ త్రో ఆటగాడు జై చౌధరీ పరిచయం అయ్యాడు.

సరదాగా చేసిన పనే:
రోజూ కనిపిస్తున్న జై చైధరీ.. జావెలిన్‌ త్రోను చేతికిచ్చి విసరమని చెప్పాడు. భారీకాయంతో ఉండి కూడా నీరవ్‌ ఎంతో చక్కటి ప్రదర్శన కనబర్చగలిగాడు. ఆటపై అసలు ఏ మాత్రం అవగాహన లేకున్నా తొలిసారే 35-40 మీటర్ల దూరం వెళ్లిపడింది. అతడి శరీరం ఆటకు అనువుగా ఉందని, జావెలిన్‌ను విసిరే శైలి ఆకట్టుకునేలా ఉందని గమనించాడు.

 

Neeraj Chopra 7

జావెలిన్ కోసమే:
జావెలిన్‌లో శిక్షణ పొందాలని నిర్ణయించుకున్న నీరజ్.. వ్యాయామమంటే ఇష్టం లేకపోయినా బరువు తగ్గడానికి సిద్ధపడ్డాడు. కుటుంబసభ్యులు ఒకవైపు ఆశ్చర్యపోయినా.. ఇష్టాన్ని కాదనలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నీరజ్‌ శిక్షణకు కావాల్సినవన్నీ సమకూర్చారు.

 

Neeraj Chopra 6

పతకాలు నిరాశపరుస్తున్నా:
చదువు కొనసాగిస్తూనే 2013లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌, 2015లో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నాడు. పతకాలు నిరాశపరుస్తున్నా ఉత్తమ ప్రదర్శన కనబరుస్తూ వచ్చాడు. 2016 కెరీర్ లో దూసుకెళ్లాడు. పతకాలు, రికార్డులతో మార్మోగుతుండగా.. సౌత్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్.. ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు.

 

Neeraj Chopra 5

స్వర్ణాల సిరీస్ ఓపెన్:
వరల్డ్‌ అండర్‌ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం.. ఈ ఫీట్ కోసం 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తం ఆరు స్వర్ణాలు సాధించి అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కేంద్రం నీరజ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.

 

Neeraj Chopra 3

శస్త్ర చికిత్స జరిగినా.. ఆగలేదు:
2019 సంవత్సరం చేదు అనుభవాన్ని మిగిల్చింది. భుజానికి గాయం, శస్త్రచికిత్స కారణంగా ఏడాదిలో జరిగిన పోటీల్లో పాల్గొనలేకపోయాడు. గాయం నుంచి కోలుకుని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివిధ పోటీల్లో పాల్గొంటూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఎలాంటి మార్పూ రాలేదని నిరూపిస్తూ.. ముందులాగే రికార్డుల పర్వం కొనసాగించాడు. 2021 మార్చిలో జరిగిన జావెలిన్‌ త్రో పోటీలో పాల్గొని 2018లో తన 87.43 మీటర్ల రికార్డును 88.07 మీటర్లతో తానే బ్రేక్ చేశాడు.

Neeraj Chopra 2

ఒలింపిక్స్‌ టార్గెట్‌గా:
ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా కఠోర శిక్షణ తీసుకున్నాడు నీరజ్ చోప్రా. ఉత్తమ ప్రదర్శనలతో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ ఎక్సలెన్సీ ప్రోగ్రామ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా కోచ్‌ గారీ కాల్వర్ట్‌ వద్ద శిక్షణ పొంది ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణం గెలిచి కల నెరవేర్చుకున్నాడు.

 

Neeraj Chopra 4

ట్రెండింగ్ వార్తలు