Mohammed Shami : అర్జున అవార్డు రేసులో మహ్మద్ షమీ..! క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్
టీమ్ ఇండియా స్టార్ పేసర్, వన్డే ప్రపంచకప్ 2023 హీరో మహ్మద్ షమీ అర్జున అవార్డు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : December 13, 2023 / 09:31 PM IST
Mohammed Shami
టీమ్ ఇండియా స్టార్ పేసర్, వన్డే ప్రపంచకప్ 2023 హీరో మహ్మద్ షమీ అర్జున అవార్డు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జునకి షమీ పేరును నామినేట్ చేసినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుత ప్రదర్శన చేయడంతోనే అతడి పేరును నామినేట్ చేశారట. అర్జున అవార్డు అందుకునేందుకు షమీ పూర్తి అర్హుడని క్రీడా మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రత్యేక అభ్యర్థనలో బీసీసీఐ పేర్కొన్నదని తెలుస్తోంది.
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ మ్యాచులో ఓడిపోయింది. టీమ్ఇండియా ఫైనల్‌కు చేరుకోవడంలో మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు. ఈ మెగాటోర్నీలో భారత జట్టు ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో అతడికి చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడడంతో షమీని తుది జట్టులోకి తీసుకున్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని షమీ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.
Rinku Singh : రింకూ సింగ్ దెబ్బ నుంచి తృటిలో తప్పించుకున్న వారు ఏమన్నారో తెలుసా..?
సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించాడు. కేవలం ఏడు మ్యాచుల్లోనే 24 వికెట్లు పడగొడ్డాడు. ఈ క్రమంలో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. వన్డే ప్రపంచకప్ అనంతరం షమీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌లను ఆడలేదు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు అతడికి ఎంపిక చేశారు.
అయితే.. ప్రస్తుతం షమీ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతడు ఫిట్‌నెస్ సాధిస్తేనే రెండు మ్యాచుల సిరీస్‌లో ఆడతాడని ఎంపిక సమయంలో బీసీసీఐ తెలిపింది.
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా తరుపున ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో విరాట్ కోహ్లీ 2013లో, రవిచంద్రన్ అశ్విన్ 2014లో రోహిత్ శర్మ 2015లో, రవీంద్ర జడేజా 2019లో శిఖర్ ధావన్ 2021లో అర్జున అవార్డును అందుకున్నారు.
Out or Not out : ఔటా..? నాటౌటా..? తలపట్టుకున్న అంపైర్లు..! జర మీరే చెప్పండి సామి..
