Out or Not out : ఔటా..? నాటౌటా..? త‌ల‌ప‌ట్టుకున్న అంపైర్లు..! జ‌ర మీరే చెప్పండి సామి..

Viral Photo- Out or Not out : పైన క‌నిపించే ఫోటోని చూసి స‌ద‌రు బ్యాట‌ర్ ఔటా..? నాటౌటా..? అన్న సంగ‌తి చెప్పండి చూద్దాం.

Out or Not out : ఔటా..? నాటౌటా..? త‌ల‌ప‌ట్టుకున్న అంపైర్లు..! జ‌ర మీరే చెప్పండి సామి..

Stump rattled but bails stay intact is the batsman out or not out

మ‌నదేశంలో క్రికెట్ ను చాలా ఎక్కువ మంది ఇష్ట‌ప‌డుతుంటారు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అప్పుడ‌ప్పుడు క్రికెట్‌లో విచిత్రాలు జ‌రుగుతుంటాయి. ఓ బౌల‌ర్ వేసిన బంతి వికెట్ల‌ను బ‌లంగానే తాకింది. మిడిల్ వికెట్ త‌న స్థానం క‌న్నా చాలా వెన‌క్కి వెళ్లిపోయింది. అయితే స్టంప్స్ మాత్రం ప‌డ‌లేదు. పైన క‌నిపించే ఫోటో అదే.. ఈ ఫోటోని చూసి స‌ద‌రు బ్యాట‌ర్ ఔటా..? నాటౌటా..? అన్న సంగ‌తి చెప్పండి చూద్దాం.

ఓ ఆ మాత్రం తెలియ‌ని అంటారా..? మిడిల్ వికెట్ అంత క్లియ‌ర్ వెన‌క్కి వెళ్లిపోయిందిగా ఖ‌చ్చితంగా ఆ బ్యాట‌ర్ ఔట్ అని అంటారా..? అక్క‌డే మీరు పొర‌బ‌డ్డారు. అంపైర్ అత‌డిని నాటౌట్ గా ప్ర‌క‌టించాడు. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న ఏసీటీ ప్రీమియ‌ర్ లీగ్‌లో చోటు చేసుకుంది. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద చర్చే జ‌రుగుతోంది.

ఏం జ‌రిగింది..?

ఏసీటీ ప్రీమియ‌ర్ క్రికెట్ టోర్నీలో భాగంగా గినిండెరా క్రికెట్ క్ల‌బ్‌, వెస్ట్ డిస్ట్రిక్ట్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో గినిండెరా బౌల‌ర్ ఆండీ రేనాల్డ్స్ బౌలింగ్ చేస్తుండ‌గా వెస్ట్ డిస్ట్రిక్ట్ ఓపెన‌ర్ మాథ్యూ బొసుస్టౌ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆండీ వేసిన ఓ బంతి వికెట్ల‌ను తాకింది. మిడిల్ వికెట్ అయితే చాలా వెన‌క్కు వెళ్లిపోయింది. అయితే.. బెయిల్స్ మాత్రం కింద‌ప‌డ‌లేదు స‌రిక‌దా క‌నీసం ప‌క్క‌కు కూడా క‌ద‌ల‌లేదు. వికెట్ తీసిన ఆనందంలో ఫీల్డ‌ర్లు మునిగిపోయారు. బ్యాట‌ర్ కూడా తాను ఔట్ అయ్యాన‌ని ముందుకు క‌దిలాడు. కొంచెం ముందుకు వెళ్లాక‌.. బెయిల్స్ కింద‌ప‌డని విష‌యాన్ని గుర్తించిన అత‌డు మ‌ళ్లీ వెన‌క్కు వ‌చ్చాడు.

త‌ల‌ప‌ట్టుకున్న అంపైర్లు..!

ఔటా..? నాటౌటా..? అన్న సంగ‌తిని తేల్చేందుకు ఆన్ ఫీల్డ్ అంపైర్లు చాలా సేపు ఒక‌రితో మ‌రొక‌రు చ‌ర్చించుకున్నారు. చాలా సేప‌టి త‌రువాత బ్యాట‌ర్ నాటౌట్ అని ప్ర‌క‌టించారు. దీంతో ఫీల్డ‌ర్లు నిరాశ చెంద‌గా, బ్యాట‌ర్ మాత్రం ఆనందంగా ఫీల్ అయ్యాడు. చేసేది లేక బౌల‌ర్ ఆండీ బౌలింగ్ కొన‌సాగించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. ఒక‌రు ఔట్ అని వాదిస్తుంటే మ‌రొక‌రు నాటౌట్ అని అంటున్నారు.

ఐసీసీ నిబంధ‌న‌ల్లో ఏం ఉందంటే..?

క్రికెట్ నిబంధ‌న‌ల‌ను మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూపొందించింది అన్న సంగ‌తి తెలిసిందే. ఎంసీసీ నిబంధ‌న 29.22 ప్ర‌కారం.. బంతి స్టంప్స్‌ను తాకిన‌ప్పుడు రెండు బెయిల్స్‌ల‌లో క‌నీసం ఒక్క‌టి అయినా కింద‌ప‌డాలి. లేదంటే క‌నీసం ఒక్క స్టంప్ అయిన స్థాన‌భ్రంశం చెందాలి. ఈ లెక్క‌న మిడిల్ వికెట్ వెన‌క్కి వెళ్లిపోయినా.. రెండు స్టంప్స్ మాత్రం చెక్కుచెద‌ర‌కుండా ఉండ‌డంతో బ్యాట‌ర్‌ను అంపైర్లు నాటౌట్‌గా ప్ర‌క‌టించారు.