IND Vs WI : గిల్ డబుల్ ధమాకా.. రోహిత్ విధ్వంసం.. విండీస్‌పై భారత్ సిరీస్ కైవసం..!
Ind Vs WI : వెస్టిండీస్‌పై రెండో వన్డేలో భారత్ 406 పరుగుల లక్ష్యాన్ని 43.3 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్లతో గెలిచింది. గిల్ 223, రోహిత్ 101తో భారత్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
- Sreehari A
- Updated on- September 30, 2026 / 10:38 PM IST
India vs West Indies
- గిల్ డబుల్ ధమాకా.. రోహిత్ సెంచరీ.. 406 ఛేజ్‌లో భారత్ చరిత్ర
- బర్సపరాలో పరుగుల సునామీ.. విండీస్‌పై టీమిండియా గెలుపు
- విండీస్ బౌలర్లకు చుక్కలు.. 2-0తో సిరీస్ కైవసం
Ind Vs WI : వెస్టిండీస్‌పై భారత్ అద్భుతమైన విజయం సాధించింది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజృంభించింది. విండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయిన భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. రోహిత్ కేవలం 74 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. అదే సమయంలో వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.
Read Also : Google Pixel 11a : గూగుల్ పిక్సెల్ 11a ఫస్ట్ లుక్ లీక్.. పర్పుల్ కలర్‌తో అదిరిపోయే డిజైన్!
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి తన బ్యాటింగ్ సత్తాను చాటాడు. కేవలం 133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్సర్లతో 223 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ తరఫున వేగవంతమైన డబుల్ సెంచరీగా 117 బంతుల్లోనే పూర్తి చేసిన గిల్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వన్డే చరిత్రలో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఇది రెండోసారి. 2006లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 438 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత ఈ ఘనత సాధించిన జట్టుగా భారత్ నిలిచింది.
భారత్ 29.1 ఓవర్లలోనే 300 పరుగుల మార్క్‌ను దాటడం కూడా కొత్త ప్రపంచ రికార్డుగా నిలిచింది. చివర్లో రుతురాజ్ గైక్వాడ్ సింగిల్‌తో విజయాన్ని పూర్తి చేయడంతో బర్సపరా స్టేడియంలో పరుగుల పండుగ ముగిసింది.
