Shubman Gill : వావ్.. ఒంటిచేత్తో కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్న శుభ్‌మన్ గిల్.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు
Shubman Gill : అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ కళ్లుచెదిరే రీతిలో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Harish Thanniru
- Updated on- June 14, 2026 / 11:39 AM IST
india vs afghanistan 1st odi shubman gill stanning catch video viral
- ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ వన్డే మ్యాచ్
- తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం
- కళ్లుచెదిరే క్యాచ్ పట్టిన గిల్.. వీడియో వైరల్
Shubman Gill : ఇండియా వర్సెస్ అఫ్తానిస్థాన్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ భారత్‌లో జరుగుతుంది. కాగా.. తొలి మ్యాచ్ శనివారం సాయంత్రం జరగ్గా.. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వర్షం కారణంగా ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టులో శుభ్‌మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు కేఎల్ రాహుల్ (39 నాటౌట్), ఇషాన్ కిషన్ (34) రాణించడంతో 22.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ పట్టిన ఓ క్యాచ్ హైలెట్ గా నిలిచింది.
అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ కళ్లుచెదిరే రీతిలో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. హర్ష్ దూబె వేసిన 22 ఓవర్లో ఘజన్ ఫర్ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో ఉన్న గిల్ అద్భుతంగా ఒంటి చేత్తో అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోసైల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు గిల్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
𝐒𝐔𝐏𝐄𝐑-𝐌𝐀𝐍 𝐆𝐈𝐋𝐋! 🦸♂️🔥
Captain #ShubmanGill pulls off a stunner in the field as #AFG loose their 8th wicket 👏#INDvAFG | 1st ODI | LIVE NOW 👉 https://t.co/wBah2REzpB pic.twitter.com/rTdzyAacl3
— Star Sports (@StarSportsIndia) June 13, 2026
