India vs Pakistan match : పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్.. షేక్ హ్యాండ్ అంశంపై మరోసారి చర్చ.. హర్మన్ ప్రీత్ కౌర్ షాకింగ్ కామెంట్స్..
India vs Pakistan match : పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతలో పాకిస్థాన్, భారత ఆటగాళ్లు మైదానంలో కరచాలనం చేసుకోలేదు. ప్రస్తుతం మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తపడుతున్న నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా.. లేదా అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
Ind vs Pak match : Harmanpreet Kaur makes key comments on shaking hands with Pakistan players
India vs Pakistan match : మహిళల టీ20 ప్రపంచకప్ -2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా గ్రూప్-ఎ మ్యాచ్‌లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా మరోసారి షేక్ హ్యాండ్ అంశం తరపైకి వచ్చింది. ఇదే అంశంపై భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతలో పాకిస్థాన్, భారత ఆటగాళ్లు మైదానంలో కరచాలనం చేసుకోలేదు. ప్రస్తుతం మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తపడుతున్న నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా.. లేదా అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇదే అంశంపై భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను మీడియా ప్రశ్నించింది. దీంతో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. మనం ఆట గురించి మాత్రమే మాట్లాడుకుందాం. క్రికెట్ మినహా మరే ఇతర అంశాలపై నేను మాట్లాడను. మేము కేవలం ఆట గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇతర జట్లతో ఎలా ఆడతామో.. అలాగే పాకిస్థాన్ జట్టుతోనూ తలపడతాం. వందశాతం విజయం కోసం మా ప్రయత్నం ఉంటుంది’ అని హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పారు.
