[svt-event title=”అడిలైడ్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం” date=”19/12/2020,13:33PM” class=”svt-cd-green” ]అడిలైడ్ తొలి టెస్టులో టీమిండియా చెత్త ప్రదర్శనతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా కోహ్లీసేనపై ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఓపెనర్లలో మ్యాథ్యూ వాడే (33), జో బర్న్స్ (51), మార్న్స్ (6), స్టీవ్ స్మిత్ (1 నాటౌట్)తో నిలిచారు. భారత్ నిర్దేశించిన 90 లక్ష్యాన్ని అలవోకగా ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు ఇద్దరే విజయ లక్ష్యానికి చేరువ చేశారు. ఆ తర్వాత వచ్చిన మార్న్స్, స్మిత్ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా అడిలైడ్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. [/svt-event]
[svt-event title=”83 పరుగుల వద్ద ఆసిస్ రెండో వికెట్ ” date=”19/12/2020,13:27PM” class=”svt-cd-green” ] అడిలైడ్ తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్.. టీమిండియా నిర్దేశించిన 90 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే దిశగా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మ్యాథ్యూ వాడే (33), జో బర్న్స్ (35) ఆది నుంచి నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారించారు. జట్టు స్కోరు 70 పరుగుల వద్ద 17.2 ఓవర్లలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోగా.. రెండో వికెట్ 83 పరుగుల వద్ద కోల్పోయింది. మార్నూస్ (6) రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 21 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి ఆసీస్ 93 పరుగులతో కొనసాగుతోంది. [/svt-event]
[svt-event title=”70 పరుగుల వద్ద ఆసిస్ తొలి వికెట్ : మ్యాథ్యూ వేడ్ రనౌట్..” date=”19/12/2020,13:15PM” class=”svt-cd-green” ] అడిలైడ్ తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్.. టీమిండియా నిర్దేశించిన 90 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే దిశగా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు మ్యాథ్యూ వాడే (33), జో బర్న్స్ (35) ఆది నుంచి నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారించారు. జట్టు స్కోరు 70 పరుగుల వద్ద 17.2 ఓవర్లలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. మ్యాథ్యూ వాడే 53 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు సాధించాడు. భారత బౌలర్ సాహా బౌలింగ్ లో సింగిల్ కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ ఆటగాళ్లలో జో బర్న్స్ (35), మార్నూస్ (6) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 19 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 77 పరుగులతో కొనసాగుతోంది. [/svt-event]
[svt-event title=”20 పరుగుల దూరంలో ఆసీస్ ” date=”19/12/2020,13:12PM” class=”svt-cd-green” ]టీమిండియాపై తొలిటెస్టులో ఆసీస్ భారత్ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంకా 20 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. టీమిండియా నిర్దేశించిన 90 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు మ్యాథ్యూ వాడే (33), జో బర్న్స్ (35) పరుగులతో కొనసాగుతున్నారు. 15 పరుగుల వద్ద లంచ్ బ్రేక్ తీసుకున్న అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆసీస్ 17 ఓవర్లు ముగిసేసరికి 70 పరుగులతో కొనసాగుతోంది..[/svt-event]
[svt-event title=”లంచ్ బ్రేక్.. లక్ష్య ఛేదనలో ఆసీస్.. రెండో ఇన్నింగ్స్ స్కోరు : 4 ఓవర్లలో 15 పరుగులు” date=”19/12/2020,12:02PM” class=”svt-cd-green” ]ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. టీమిండియా నిర్దేశించిన 90 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు మ్యాథ్యూ వాడే (14), జో బర్న్స్ (0) పరుగులతో కొనసాగుతున్నారు. భారత బౌలర్ ఉమేశ్ యాద్ తొలి ఓవర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 4 ఓవర్లు ముగిసేసరికి 15 పరుగులతో కొనసాగుతోంది.. లంచ్ బ్రేక్ తీసుకుంది. [/svt-event]
[svt-event title=”కుప్పకూలిన టీమిండియా: ఆసీస్ టార్గెట్ 90 పరుగులు” date=”19/12/2020,11:20AM” class=”svt-cd-green” ]అడిలైడ్ టెస్టులో టీమిండియా చెత్త ప్రదర్శనతో తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీసేన కుప్పకూలింది. 36 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. టెస్టుల్లో టీమిండియాకు ఇదే అత్యల్ప స్కోరు. ఆసీస్ పేస్ దెబ్బకు భారత బ్యాట్స్ మెన్ చేతులేత్తేశారు. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 90 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కోహ్లీసేన అత్యంత చెత్త ప్రదర్శనతో తేలిపోయింది. కెప్టెన్ కోహ్లీ, పృథ్వీషా నాలుగు పరుగులకే పరిమితమం కాగా.. వచ్చినవారు వచ్చినట్టుగా ఆటగాళ్లంతా పెవిలియన్ చేరారు. రహానె, పుజారా డకౌట్ అయ్యారు. కనీసం రెండంకెల స్కోరు కూడా దాటలేదు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్, హేజల్ వుడ్ నిప్పులు చెలరేగి టీమిండియా పతనాన్ని శాసించారు. ప్రస్తుతానికి 89 పరుగుల లోపే టీమిండియా ఆధిక్యంలో ఉంది. ప్రత్యర్థి జట్టు ఆసీస్ కు 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.[/svt-event]
[svt-event title=”భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 36/9 :” date=”19/12/2020,10:51AM” class=”svt-cd-green” ]
ఆసీస్-భారత్ మధ్య జరుగుతున్న టెస్టుమ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేలవ ప్రదర్శనతో వరుస వికెట్లు చేజార్చుకుంది. ఆధిక్యం దిశగా మంచి స్కోరు సాధించి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచాలన్న భారత్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఆసీస్ పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో కోహ్లీసేనను పెవిలియన్ బాటపట్టించారు. పదునైన బంతులతో ఇప్పటికే 9 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం 21.2 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 36 పరుగులతో కొనసాగుతోంది. [/svt-event]
[svt-event title=”అడిలైడ్ తొలి టెస్టు : కుప్పకూలిన టాప్ ఆర్డర్.. భారత్ స్కోరు 26/8″ date=”19/12/2020,10:51AM” class=”svt-cd-green” ] Adelaide First Test- AUS vs India : అడిలైడ్ తొలి టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా పేస్ దెబ్బకు భారత బ్యాట్స్ మెన్ ఒకరితరువాత మరొకరు వరుసగా పెవిలియన్ క్యూ కట్టేస్తున్నారు. 19 పరుగులకే టీమిండియా 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద పృథ్వీ షా (4) తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత బుమ్రా(2) తో రెండో వికెట్ కోల్పోయింది. పుజారా(0), విరాట్ కోహ్లీ (4), మయాంక్(9), అజింక్య రహానె(0) వరసగా పెవిలియన్‌కు చేరారు. భారత్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం విరాట్ కోహ్లీ(4) ఒక బౌండరీ బాదగా చివరికి జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ తొలి ఓవర్ బౌలింగ్ నుంచి భారత వికెట్ల పతనం ఆరంభమైంది. కోహ్లీ కూడా చేతులేత్తేశాడు. అనంతరం వృద్ధిమాన్ సాహా (4) వెనుదిరిగాడు. ఆ వెంటనే అశ్విన్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు 18.5 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు నష్టానికి అత్యంత స్వల్పంగా 26 పరుగులకే పరిమితమైంది. భారత్ 79 పరుగులతో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం హనుమవిహారి (3) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, హాజిల్‌వుడ్ తలో నాలుగు వికెట్లు తీసుకున్నారు. [/svt-event]