×
Ad

India Vs South Africa: ఉత్కంఠభరిత పోరులో టీమిండియాదే గెలుపు.. భారత్ ను భయపెట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు..!

చివరి వరకు పోరాట పటిమ చూపింది. కానీ, ఓటమి తప్పలేదు.

  • Published On : November 30, 2025 / 10:15 PM IST

Courtesy @ EspnCricinfo

India Vs South Africa: రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ గెలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. భారత్ ను భయపెట్టినంత పని చేసింది.

విజయానికి చేరువగా వచ్చింది. ఎదుట కొండంత లక్ష్యంగా ఉన్నా.. సౌతాఫ్రికా బ్యాటర్లు బెదరలేదు. చివరి వరకు పోరాట పటిమ చూపించారు. కానీ, ఆ జట్టుకి ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా 332 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో బ్రిట్జ్ కీ (72), జాన్ సెన్ (70), బాష్ (67) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. 4 వికెట్లు తీసి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. హర్షిత్ రానా 3 వికెట్లతో మెరిశాడు. అర్ష్ దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్లు భారత్ ను భయపెట్టినంత పని చేశారు. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినా ఆ జట్టు వెనక్కి తగ్గలేదు. బ్యాట్స్ మెన్ చివరి వరకు పోరాడారు. బ్రిట్జ్ కి, జాన్ సెన్, బాష్, బ్రెవిస్ అద్భుతమైన ఆటతీరుతో అలరించారు. చివరికి 332 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది.

ముఖ్యంగా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ చెలరేగిపోయాడు. సిక్సుల మోత మోగించాడు. 39 బంతుల్లోనే 70 పరుగులు చేశాడంటే.. బ్యాటుతో ఏ విధంగా చెలరేగిపోయాడో అర్థం చేసుకోవచ్చు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 120 బంతుల్లోనే 135 పరుగులు చేశాడు. అతడి ఇన్సింగ్స్ లో ఏకంగా 7 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) హాఫ్ సెంచరీలతో మెరిశారు. జైస్వాల్ 18, సుందర్ 13, జడేజా 32 రన్స్ చేశారు.

Also Read: పవర్ కోచ్‌గా ఆండ్రీ రస్సెల్‌.. చరిత్రలో ఎప్పుడూ లేని కొత్త రోల్‌.. పవర్ కోచ్ అంటే ఏంటి?