డబుల్ సెంచరీతో వెనుదిరిగిన రోహిత్

రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా ఓవర్ నైట్ స్కోరు 224/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ దూకుడుగా ఆడింది. ఉదయం ఆటలో సెంచరీకి మించిన స్కోరుతో రహానె వెనుదిరిగితే లంచ్ బ్రేక్ తర్వాత రోహిత్ డబుల్ సెంచరీ దాటేసి పెవిలియన్ బాటపట్టాడు. అగర్వాల్, పూజార్ వికెట్లు పడగొట్టిన రబాడాకే రోహిత్ వికెట్ కూడా దక్కింది. 

రహానె(115) అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా రావడంతో దూకుడు పెంచాడు రోహిత్. 130 బంతుల్లో సెంచరీ కొట్టిన రోహిత్ 249 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేయగలిగాడు. క్రీజులో రవీంద్ర జడేజా(15), వృద్ధిమాన్ సాహా(0) పరుగులతో ఉన్నారు.