INDvsSA: సఫారీలపై బౌలింగ్ తీసుకున్న భారత్

వెస్టిండీస్ పర్యటన అనంతరం సొంతగడ్డపై జరుగుతోన్న పోరులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దక్షిణాఫ్రికాతో మొహాలి వేదికగా బుధవారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ను ధర్మశాల వేదికగా గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా.. కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. 

మూడు టీ20‌ల ఈ సిరీస్‌లో బోణి కొట్టాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలో ఆ టోర్నీలో సత్తా చాటాలాని యువ క్రికెటర్లకి మ్యాచ్‌లో అవకాశాలిస్తూ వస్తోంది భారత్. రికార్డుల పరంగా చూసుకుంటే టీ20ల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. 

టీ20ల్లో 13 సార్లు ఇరుజట్లు తలపడినప్పటికీ టీమిండియా 8 మ్యాచ్‌ల్లో విజయాల్ని దక్కించుకుంది. 5 మ్యాచ్ లు మాత్రం సఫారీలు గెలుపొందారు.  సొంతగడ్డపై జరిగిన అన్ని టీ20 మ్యాచ్‌ల్లో సఫారీలే పైచేయి సాధించారు. ఈ మ్యాచ్‌లోనూ అదే కొనసాగించాలని చూస్తున్న దక్షిణాఫ్రికాను అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. 

India : Rohit Sharma, Shikhar Dhawan, Virat Kohli(c), Shreyas Iyer, Rishabh Pant(w), Hardik Pandya, Krunal Pandya, Ravindra Jadeja, Washington Sundar, Deepak Chahar, Navdeep Saini

South Africa: Quinton de Kock(w/c), Reeza Hendricks, Temba Bavuma, Rassie van der Dussen, David Miller, Andile Phehlukwayo, Dwaine Pretorius, Bjorn Fortuin, Kagiso Rabada, Anrich Nortje, Tabraiz Shamsi