Abhishek Sharma : సిక్సర్లతో విరుచుకుపడిన అభిషేక్ శర్మ.. గంట వ్యవధిలో 25 నుంచి 30 సిక్సర్లు.. ప్రత్యర్థులకు దబిడిదిబిడే..
యూఏఈతో పాటు మిగిలిన టీమ్‌లకు టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) హెచ్చరిక పంపాడు.

Abhishek Sharma stunned everyone by slamming 25 to 30 sixes during batting practice
Abhishek Sharma : ఆసియాకప్ 2025లో భారత జట్టు నేడు (సెప్టెంబర్ 10న)తొలి మ్యాచ్ ఆడబోతుంది. దుబాయ్ వేదికగా ఆతిథ్య యూఏఈతో తలపడబోతుంది. ఈ క్రమంలో యూఏఈతో పాటు మిగిలిన టీమ్‌లకు టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) హెచ్చరిక పంపాడు. యూఏఈతో మ్యాచ్‌కు ముందు మంగళవారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో ఏకంగా 25 నుంచి 30 సిక్సర్లు బాదాడు.
మంగళవారం టీమ్ఇండియా ఆటగాళ్లకు ఐచ్చిక నెట్ సెషన్‌ను నిర్వహించారు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, జితేశ్ శర్మ లు సాధన చేశారు. ఐచ్చిక సెషన్ కావడంతో సీనియర్ ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణాలు విశ్రాంతి తీసుకున్నారు.
Shubman Gill Clean Bowled : యూఏఈతో మ్యాచ్‌కు ముందు.. స్థానిక బౌలర్ చేతిలో గిల్ క్లీన్ బౌల్డ్..
కాగా.. ఐచ్చిక సెషన్ అయినప్పటికి ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా సాధన చేశాడు. నెట్ బౌలర్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాడు. అతడి చేతి, కంటి సమన్వయం చాలా బాగుంది. పీటీఐ ప్రకారం అతడు గంట వ్యవధిలో 25 నుంచి 30 సిక్సర్లు బాదాడు. ఇది అతడికి మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ఉంటుంది.
2024లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు అభిషేక్ శర్మ. ఓపెనర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాలను అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 33.4 సగటు, 193.8 స్ట్రైక్‌రేటుతో 535 పరుగులు చేశాడు. ఇందులో 46 ఫోర్లు, 41 సిక్సర్లు ఉన్నాయి.
ఇక ఆసియాకప్‌లోనూ అతడు మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతడి తోడుగా మరో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలలో ఎవరు వస్తారా? అన్న ఆసక్తి అందరిలో ఉంది.
ఆసియాకప్‌లో భారత షెడ్యూల్ ఇదే..
* సెప్టెంబర్ 10 – యూఏఈతో
* సెప్టెంబర్ 14 – పాకిస్తాన్‌తో
* సెప్టెంబర్ 19 – ఒమన్‌తో