IPL : ఐపీఎలా మ‌జాకా.. 15 రాష్ట్రాల బ‌డ్జెట్ కంటే ఈ బ్రాండ్ వాల్యూ టాప్‌.. ఎన్నిల‌క్ష‌ల కోట్లంటే?

ఐపీఎల్ (IPL ) బ్రాండ్ వాల్యూ ప్ర‌తి ఏడాది పెరుగుతోంది.

Indian Premier League business value crossed the $20 billion mark

IPL : ఐపీఎల్ (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) బ్రాండ్ వాల్యూ ప్ర‌తి ఏడాది పెరుగుతోంది. గ‌త ఏడాది కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక టీ20 క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్.. వ్యాపార విలువ ఏకంగా 11 శాతం కంటే ఎక్కువ పెరిగి 20.6 బిలియన్ డాలర్లకు చేరిందని గ్లోబ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ హౌలిహాన్ లోకీ తెలిపింది. అంటే భార‌త క‌రెన్సీలో సుమారు 1.97 ల‌క్ష‌ల కోట్లు అన్న‌మాట‌.

2008లో ప్రారంభమైన ఐపీఎల్ ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, మెర్చండైజింగ్, ఫ్రాంచైజీ పెట్టుబడులు వంటి బలమైన ఆదాయ వనరులతో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన క్రికెట్ లీగ్‌గా ఎదిగింది. ప్రపంచ అగ్రశ్రేణి క్రికెటర్లను ఆకర్షిస్తూ ప్రతి ఏడాది తన వాణిజ్య విలువను మరింత పెంచుకుంటోంది.

Clicky Ponting : ఇదేం స్కామ్‌రా అయ్యా.. అంపైర్‌నే మాయ చేశావుగా.. చిటిక వేసి ఔట్‌.. వీడియో వైర‌ల్‌..

హౌలిహాన్ లోకీ డైరెక్టర్ హర్ష్ తాలికోటి మాట్లాడుతూ.. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు కొత్త గరిష్ఠ స్థాయికి చేరాయని, ప్రైవేట్ పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. క్రీడలు, మీడియా, వినియోగదారుల మార్కెట్‌ల సమ్మేళనంగా ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా మరింత బలమైన బ్రాండ్‌గా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.

దీనిపై సోష‌ల్ మీడియాలో కాస్త స‌ర‌దా చ‌ర్చ మొద‌లైంది. భార‌త‌దేశంలోని 15 రాష్ట్రాల బ‌డ్జెట్ కంటే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎక్కువ‌గా ఉంద‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

2 ల‌క్ష‌ల కోట్ల కంటే త‌క్కువ బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రాలు ఇవే..

* అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ – రూ.36,607 కోట్లు
* అస్సాం – రూ.1,55,985 కోట్లు
* ఛ‌త్తీస్‌గ‌ఢ్ – రూ.1,72,000 కోట్లు
* ఢిల్లీ – రూ.1,00,000 కోట్లు
* గోవా – రూ.30,195 కోట్లు
* హిమాచ‌ల్ ప్ర‌దేశ్ – రూ.54,928 కోట్లు
* జ‌మ్మూ అండ్ కశ్మీర్ – రూ.1,27,767 కోట్లు
* జార్ఖండ్ – రూ.1,50,106 కోట్లు
* మ‌ణిపూర్ – రూ.32,339 కోట్లు
* మేఘాల‌య – రూ.32,023 కోట్లు
* మిజోరాం – రూ.17,469 కోట్లు
* నాగాలాండ్ – రూ.24,699 కోట్లు
* సిక్కిం – రూ.16,196 కోట్లు
* త్రిపుర – రూ.34,212 కోట్లు
* ఉత్త‌రాఖండ్ – రూ.1,11,703 కోట్లు