IND vs NZ : భారత జట్టు వరల్డ్ రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి టీంగా గుర్తింపు..
Indian Team World Record : టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు ప్రపంచ రికార్డును నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో 11 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించింది.
- Harish Thanniru
- Published on- November 2, 2026 / 07:37 AM IST
Indian team World record
Indian Team World Record : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. దీంతో 3-2తో భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ భారత జట్టు వరల్డ్ రికార్డు సాధించింది.
Also Read : IND vs NZ : బుధవారం నుంచి భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జియోలో రాదు మరి ఎక్కడ చూడొచ్చంటే?
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత జట్టు సరికొత్త ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 400 సిక్సర్లు కొట్టిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆదివారం హోమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో శ్రేయస్ సేన ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు 11 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు.
ఈ ఏడాది 40 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు.. మొత్తం 400 సిక్సర్లు నమోదు చేసింది. ఈ మొత్తంలో ఒక్క న్యూజిలాండ్ జట్టుపైనే ఏకంగా 142 సిక్సర్లు కొట్టడం గమనార్హం. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒక ప్రత్యర్థి జట్టుపై ఒక టీమ్ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం గమనార్హం. ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్లలో భారత్ తరువాత ఆస్ట్రేలియా ఉంది. ఆ జట్టు 24 టీ20 మ్యాచ్‌లలో 224 సిక్సర్లు కొట్టింది. వెస్టిండీస్ జట్టు 21 మ్యాచ్‌లలో 224 సిక్సర్లు కొట్టింది.
ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లలో ముగ్గురు ఉన్నారు. వారిలో అభిషేక్ శర్మ (86 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (60 సిక్సర్లు), సంజూ శాంసన్ (50 సిక్సర్లు) ఉన్నారు.
సిక్సర్ల విషయంలో భారత్ తర్వాతి స్థానాల్లో ..
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్ల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా 2025లో 36 మ్యాచ్‌ల్లో 326 సిక్సర్లు బాది నెలకొల్పిన రికార్డును భారత్ అధిగమించింది.
భారత్ – 400 సిక్సర్లు (2026), ఆస్ట్రేలియా – 326 సిక్సర్లు (2025), భారత్ – 289 సిక్సర్లు (2022), బహ్రెయిన్ – 239 సిక్సర్లు (2025), వెస్టిండీస్ – 238 సిక్సర్లు (2024), – భారత్ – 236 సిక్సర్లు (2024)
