IndVsSA 3rd T20I : తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టిన భారత్.. సౌతాఫ్రికాపై ఘనవిజయం

ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. గెలుపు ఖాతా తెరిచింది. సిరీస్ లో పోటీలో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పంత్ సేన అదరగొట్టింది.

IndVsSA 3rd T20I : ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. గెలుపు ఖాతా తెరిచింది. సిరీస్ లో పోటీలో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో సౌతాఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించింది. రెండు వరుస ఓటముల తర్వాత విశాఖ వేదికగా జరిగిన మూడో టీ 20లో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌ ఆశలను సజీవం చేసుకుంది

భారత్ నిర్దేశించిన 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 19.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గత రెండు మ్యాచుల్లో విఫలమైన భారత బౌలర్లు ఈసారి సమష్టిగా రాణించారు. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశాడు. యజువేంద్ర చాహల్ మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.(IndVsSA 3rd T20I)

IPL 2023: రూ.43వేల కోట్లు దాటిన టెలికాస్టింగ్ హక్కుల ధర

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా రెండు విజయాలు సాధించగా, భారత్ ఒక విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్ (57; 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (54; 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.


180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 131 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లాసెన్‌ (29) టాప్‌ స్కోరర్. హెన్రిక్స్‌ (23), ప్రిటోరియస్ (20), బవుమా (8), డసెన్ (1), డేవిడ్‌ మిల్లర్ (3), కేశవ్‌ మహరాజ్‌ (11), రబాడ (9), నార్జ్‌ (0), షంసి (0) పరుగులు చేశారు. పార్నెల్ ( 22)నాటౌట్‌గా నిలిచాడు.

Nikhat Zareen: కమ్యూనిటీని కాదు, నా దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నా – నిఖత్ జరీన్

తొలుత టీమిండియాకు పెనర్లు శుభారంభం అందించారు. మొదట్లో ఇషాన్‌ కిషన్‌ నెమ్మదిగా ఆడినా.. రుతురాజ్‌ దూకుడు ప్రదర్శించాడు. రబాడ వేసిన మూడో ఓవర్‌లో రుతురాజ్‌ గైక్వాడ్ ఓ ఫోర్‌, సిక్స్ బాదగా.. అన్రిచ్ నోర్జే వేసిన ఐదో ఓవర్‌లో వరుసగా ఐదు ఫోర్లు బాది తన విశ్వరూపం చూపించాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఈ క్రమంలోనే షంసి వేసిన తొమ్మిదో ఓవర్‌లో టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్‌.. కేశవ్‌ మహరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో ఔటయ్యాడు. షంసి వేసిన 13 ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్, ప్రిటోరియస్ వేసిన 14వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ ఔటయ్యారు. దీంతో స్కోరు వేగం నెమ్మదించింది. చివర్లో హార్దిక్‌ కాస్త దూకుడుగా ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్‌ రెండు వికెట్లు తీశాడు. రబాడ, షంసి, కేశవ్‌ మహరాజ్‌ తలో వికెట్‌ తీశారు.

ట్రెండింగ్ వార్తలు