INDW vs ZIMW 3rd ODI : వైష్ణవి శర్మ స్పిన్ మ్యాజిక్.. 17 ఓవర్లలోనే భారత్ విజయం.. స్మృతి మంధానకు అదిరిపోయే ఆరంభం..

IND vs ZIM Women 3rd ODI: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

IND vs ZIM Women 3rd ODI

INDW vs ZIMW 3rd ODI : జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. భారత యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ ఐదు వికెట్లతో ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించగా.. బ్యాటింగ్‌లో ప్రతీకా రావల్, షఫాలీ వర్మ అర్ధశతకాలతో అదరగొట్టారు.

Also Read : Abhishek Sharma : కివీస్‌పై ఊచకోత ఎఫెక్ట్.. మళ్లీ అగ్రస్థానంలోకి అభిషేక్ శర్మ.. నువ్వు తోపు సామీ..

టాస్ అనంతరం క్రీజులోకి వచ్చిన జింబాబ్వే బ్యాటర్లు భారత బౌలర్ల బౌలింగ్ ధాటికి ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. దీంతో 39.5 ఓవర్లలో 131 పరుగులకే జింబాబ్వే జట్టు ఆలౌట్ అయింది. వైష్ణవి శర్మ 10 ఓవర్లలో 39 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గౌడ్, సయాలి సత్‌ఘరే రెండేసి వికెట్లు తీశారు. జింబాబ్వే బ్యాటర్లలో మోడెస్టర్ ముపాచిక్వా 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 17 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్రతీకా రావల్ 56 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేయగా.. షఫాలీ వర్మ కేవలం 26 బంతుల్లోనే 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీంతో భారత్ మరో 33 ఓవర్లు మిగిలి ఉండగానే విజయకేతనం ఎగురవేసింది. దీంతో 3-0తో వన్డే సిరీస్ ను క్లీన్‌స్వీప్ చేసింది.

పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధానకు ఈ వన్డే సిరీస్ విజయవంతమైన ఆరంభంగా నిలిచింది. అంతకుముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కూడా భారత్ 3-0తో కైవసం చేసుకుంది. జింబాబ్వేతో జరిగిన తొలి ద్వైపాక్షిక మహిళల క్రికెట్ సిరీస్‌లో భారత జట్టు రెండు ఫార్మాట్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది.