David Warner : డేవిడ్ వార్నర్‌కు గాయం.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా?
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.
- Thota Vamshi Kumar
- Published On : February 24, 2024 / 03:29 PM IST
David Warner
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మిగిలిన పర్యటనకు దూరం అయ్యాడు. ప్రస్తుతం అతడు తుంటి గాయంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు రెండో టీ20 మ్యాచ్‌కు దూరంగా ఉండగా తాజాగా సిరీస్ మొత్తానికే దూరం అయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.
డేవిడ్ వార్నర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని, అందుకు ఏడు నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ సమయానికి అతడు ఫిట్‌నెస్ సాధిస్తాడనే ధీమాను వ్యక్తం చేసింది. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్‌కు వార్నర్ ఖచ్చితంగా అంటుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చింది.
IPL 2024 : రిషబ్‌పంత్, హార్దిక్ పాండ్య ఐపీఎల్ 2024 యాడ్ వీడియోలు లీక్..
వన్డేలు, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన వార్నర్ ప్రస్తుతం టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లోనూ ఉన్నాడు. కివీస్‌తో జరిగిన తొలి టీ20లో 20 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఏడాది రిషబ్ పంత్ గైర్హజరీలో జట్టుకు నాయకత్వం వహించాడు. ఆరు అర్ధశతకాలతో 516 పరుగులు చేశాడు. బ్యాటర్‌గా ఆకట్టుకున్నా కెప్టెన్సీలో మాత్రం విఫలం అయ్యాడు.
అతడి కెప్టెన్సీలో ఢిల్లీ 14 మ్యాచులు ఆడింది. 5 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. తొమ్మిది మ్యాచుల్లో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
