IND vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్..!
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (IND vs ENG) భారత్ శుభారంభం చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 15, 2026 / 08:42 AM IST
Injury scare for team india Shubman Gill retired hurt in 1st odi against england
- తొలి వన్డేలో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన శుభ్‌మన్ గిల్
- కెప్టెన్ గాయంపై ఇప్పటి వరకు లేని స్పష్టత
- రెండో వన్డే ఆడేనా?
IND vs ENG : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా.. ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదన మధ్యలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ అంశమే గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌ను టెన్షన్ పెడుతోంది.
259 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో గిల్ కుడి కాలి వెనుక భాగంలో తీవ్రమైన క్రాంప్స్‌కు గురయ్యాడు. 26వ ఓవర్‌లో జోష్ టంగ్ వేసిన బంతిని ఎదుర్కొన్న అనంతరం అసౌకర్యానికి గురైన గిల్.. గ్లౌజులు తొలగించి మైదానంలోనే కూర్చుని కాలును పట్టుకున్నాడు. వెంటనే ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో బ్యాటింగ్ కొనసాగించలేక గిల్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్‌లో గిల్ 75 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 80 పరుగులుచేశాడు.
కాగా.. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ గాయం తీవ్రతపై ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అతడి గాయం తీవ్రమైనది అయితే మాత్రం భారత్‌కు ఇబ్బందులు తప్పవు. గాయం తీవ్రమైనది అయి అతడు గురువారం (జూలై 16న) జరగనున్న రెండో వన్డేకు దూరం అయితే అది భారత్‌కు తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత్.. వన్డే సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో గిల్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
