Mahatma Gandhi
Mahatma Gandhi : ఫుట్ బాల్‌కి ప్రసిద్ధి చెందిన దేశంలో ఓ బ్రెజిలియన్ అందులో దూసుకుపోతున్నాడంటే అతిశయోక్తి కాకపోవచ్చును.. కానీ అతని పేరు ‘మహాత్మా గాంధీ’ అని చెప్పినపుడు ఖచ్చితంగా అతని గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ ‘మహాత్మా గాంధీ’ గురించి తెలుసుకుందాం.
Virat Kohli : సెంచరీ తరువాత విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైరల్..
బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టులో ‘మహాత్మా గాంధీ’ అనే ప్లేయర్ ఉన్నాడు. అతను మిడ్ ఫీల్డర్‌గా ఆడతాడు. ఇతని వయసు 31 సంవత్సరాలు. 1992 ఫిబ్రవరి 18న బ్రెజిల్‌లోని గోయానియాలో జన్మించిన మహాత్మా గాంధీ హెబెర్పియో మాటోస్ పైర్స్ మన ‘జాతిపిత’ మహాత్ముని పేరు పెట్టుకోవడం విశేషం. మహాత్మా గాంధీ ప్రస్తుతం ఫుట్‌బాల్ క్లబ్ ఇపోరా కోసం అట్లెటికో గోయానియెన్స్ నుండి రుణం తీసుకుని ఆడుతున్నాడు. గాంధీ 2012లో బ్రెజిల్ యొక్క సీరీ Aలో ఏడుసార్లు కనిపించాడు. ఫుట్‌బాల్‌లో తన ఆట తీరుతో పేరు తెచ్చుకున్నా ప్రపంచ చరిత్రలో ఒక ప్రముఖమైన వ్యక్తి పేరు కలిగి ఉండటం మాత్రం అతని పేరును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది.
ఇంకా బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లో ప్లేయర్స్‌కి ఆసక్తికరమైన పేర్లు ఉన్నాయి. ప్రసిద్ధ బీటిల్స్ సింగర్ జాన్ లెన్నాన్ పేరు మీద ఒక ఆటగాడికి జాన్ లెన్నాన్ సిల్వా శాంటోస్ అని పేరు పెట్టారు. ఇతర బ్రెజిలియన్ జట్లలో పికాచు అనే ఆటగాడు ఉన్నాడు. బెన్-హర్ మోరీరా పెరెస్, మార్లోనో బ్రాండో, మస్కిటో ఈ పేర్లు బ్రెజిలియన్ ఫుట్ బాల్ అరేనాలోని కొన్ని ఆసక్తికరమైన పేర్లు.
Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. సచిన్ శతకాల రికార్డు బ్రేక్
మోహన్ దాస్ కరంచంద్ గాంధీని మన దేశంలో ‘మహాత్మా గాంధీ’ అని పిలుచుకుంటాం. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన, స్ఫూర్తివంతమైన వ్యక్తులలో మహాత్మా గాంధీ ఒకరు. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలకపాత్ర వహించిన మహాత్మా గాంధీని ఎంతో గౌరవిస్తారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకారం 1983 నుండి 1915 వరకు మహాత్మా గాంధీ సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో ప్యాసివ్ రెసిస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ కోసం మూడు జట్లను స్ధాపించడంలో కీలక పాత్ర పోషించారు. గాంధీచే స్థాపించబడిన ఈ ఫుట్‌బాల్ క్లబ్‌లు జోహన్నెస్ బర్గ్, ప్రిటోరియా, డర్బన్ లలో ఉన్నాయి. అలాగే 1896 లో ట్రాన్స్ వాల్ ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా కీలక పాత్ర పోషించారు.