చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అతనితో పాటు సపోర్ట్ స్టాఫ్ లో 12మందికి కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. మరి కొద్దివారాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2020 ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుల్లో పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉంది. సీఎస్కే అన్ని ప్రొటోకాల్స్ పాటిస్తుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఇచ్చిన సూచనలనే అనుసరిస్తున్నారు.
దుబాయ్ కు వెళ్లిన తర్వాత ఒకటో రోజు.. మూడో రోజు టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. యూఏఈకి వచ్చిన ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌కు ఒకటో రోజు, మూడో రోజు, ఆరో రోజు కరోనా టెస్టులు చేశారు. అన్ని సక్సెస్ ఫుట్ టెస్టుల తర్వాత ప్లేయర్లను బయో సెక్యూర్ బబుల్ లోకి పంపించారు.
సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్ లను మరో 2వారాల పాటు ఐసోలేషన్ లో ఉంచుతారు. రెండు వారాల ఐసోలేషన్ తర్వాత ప్రతి ఒక్కరు 2నెగెటివ్ పీసీఆర్ టెస్టు రిపోర్టులతో బయటకు వస్తారు. అప్పుడే వాళ్లను మరో బయో సెక్యూర్ బబుల్ లోకి ఎంటర్ అవడానికి అనుమతిస్తారు.
టీం యాక్టివిటీస్ తర్వాత కార్డియాక్ స్క్రీనింగ్ తప్పనిసరి. చెన్నై సూపర్ కింగ్స్ మెంబర్స్ దుబాయ్ లో 6రోజుల క్వారంటైన్ పీరియడ్ ను పూర్తి చేసుకున్నారు. కొందరు మాత్రం టైనింగ్ కు తిరిగి రాలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు.