IPL 2020కు వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయా.. లీగ్ పరిస్థితేంటి?

CSK టీమ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులను.. టోటల్ ఐపీఎల్‌కే పెద్ద వార్నింగ్ అనుకోవచ్చా? ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు తీసుకుంటున్నా జాగ్రత్తలేంటి? ఆ ప్రాసెస్ ఎలా ఉంది? ఇన్ని సేఫ్టి మెజర్స్ తీసుకున్నా.. వైరస్ ఎలా సోకింది? ఇప్పుడివే ప్రశ్నలు.. క్రికెట్ ఫ్యాన్స్ మెదడను తొలిచేస్తున్నాయ్. అసలేం జరుగుతోంది.. దుబాయ్ క్వారంటైన్‌లో..

దేశంలో కరోనా విజృంభిస్తోందని.. ఐపీఎల్ వేదికను దుబాయ్‌కి మార్చారు. టీమ్స్ కూడా అక్కడ ల్యాండైపోయాయ్. అప్పుడంతా బాగానే ఉంది. సరిగ్గా.. క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్‌ కోసం గ్రౌండ్‌లోకి కాలు పెట్టే సమయానికి.. కరోనా బాంబ్ పేలింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో.. ఇద్దరు ప్లేయర్లతో పాటు కొందరు సహాయ సిబ్బందికు కూడా కరోనా సోకడం కలవరపెడుతోంది. ఇది.. మిగతా ఫ్రాంచైజీలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. మొత్తం ఐపీఎల్‌నే ప్రశ్నార్థకం చేస్తోంది.

కరోనాను దృష్టిలో ఉంచుకొని.. ఆటగాళ్ల విషయంలో ఫ్రాంచైజీలు పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా.. వైరస్ వాటన్నింటిని దాటుకొని మరీ సోకింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రావడం.. మొత్తం ఐపీఎల్‌కే పెద్ద వార్నింగ్‌లా కనిపిస్తోందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

మిగిలిన జట్ల సంగతి:
మేజర్ ఫ్రాంచైజీలన్నీ.. తమ టీమ్ ప్లేయర్లతో పాటు సిబ్బందికి ఒకటికి రెండుసార్లు కరోనా టెస్టులు చేసి దుబాయ్ ఫ్లైట్ ఎక్కించాయ్. అక్కడ కూడా ఎవరూ కరోనా బారిన పడకుండా.. కఠినమైన జాగ్రత్తలు పాటించారు. వారికి ప్రత్యేక కిట్‌లు కూడా అందించారు. అక్కడికి వెళ్లగానే.. ముందుగా ప్లేయర్లను, సహాయకులను క్వారంటైన్ చేశారు. వారికి అన్ని సదుపాయాలు కల్పించారు. క్వారంటైన్ ముగిశాకే.. ప్రాక్టీస్ మొదలుపెట్టాలని నిశ్చయించారు. కానీ.. ఇంతలోనే కరోనా వచ్చిపడింది.

దుబాయ్ లో ఏం చేయాలి:
దుబాయ్‌కి వెళ్లిన ఐపీఎల్ టీమ్స్‌.. మొదటగా ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాతే.. ప్రాక్టీస్ మొదలుపెట్టాలి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దుబాయ్ చేరాక.. తొలి రోజు.. 3వ రోజు.. 6వ రోజు.. కరోనా టెస్టులు చేశారు. మిగతా టీమ్స్ కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాయ్. ఐతే.. చివరి రోజు ఫలితాల్లో.. సీఎస్‌కే బృందంలోని కొందరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో.. ఆ టీమ్ ఇప్పుడు మంగళవారం వరకు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తోంది. కరోనా దెబ్బతో.. సీఎస్కే ఆటగాళ్లు, సిబ్బంది, ప్రతినిధులకు.. మరోసారి టెస్టులు చేశారు. ఆ ఫలితాలు ఇంకా తేలాల్సి ఉంది.

ఇప్పటికే కొన్ని టీమ్స్.. సక్సెస్‌ఫుల్‌గా క్వారంటైన్ ముగించుకొని.. ప్రాక్టీస్ కోసం గ్రౌండ్‌లోకి దిగిపోయాయ్. సీఎస్కే టీమ్‌లో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు తేలడంతో.. చెన్నై టీమే.. చివరగా ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది.

క్లారిటీతో బీసీసీఐ:
దుబాయ్‌లోని ఐపీఎల్ ఆటగాళ్ల రక్షణపై.. బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీలన్నీ ఫోకస్ పెట్టాయి. అక్కడికి చేరుకున్న క్రికెటర్లు.. కరోనా ప్రోటోకాల్స్ బ్రేక్ చేయకుండా.. జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే బీసీసీఐ హెచ్చరించింది. ఎన్నో ఆటంకాలను అధిగమించి.. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఈ మధ్యే యూఏఈలో కరోనా విజృంభణ పెరిగింది. దీంతో ఐపీఎల్ పాలకమండలి, బీసీసీఐ అప్రమత్తమయ్యాయి. ప్లేయర్లు, ఫ్రాంచైజీలకు.. కరోనా విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి.

స్పెషల్ ఆర్డర్స్:
దుబాయ్‌కి చేరిన ప్లేయర్లు, సహాయక సిబ్బంది, ఓనర్లు, ఫ్రాంచైజీలకు.. ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దని సూచించింది. ఇప్పటికే.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు దుబాయ్ చేరుకున్నాయి. ఆటగాళ్ల భద్రతకు అవసరమైన అన్ని వసతులను యూఏఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు