IPL 2021: ఎంఎస్ ధోనీ.. రైనాల బ్యాట్ మోసుకెళ్లిన రాబిన్ ఊతప్ప
మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ, సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనాకు సాయం అందిస్తున్నట్లుగా వీడియో రికార్డు అయింది. ధోనీతో పాటు రైనాల బ్యాట్స్, హెల్మెట్స్ మోసుకొస్తున్న వీడియో.
- Subhan Ali Shaik
- Published On : September 26, 2021 / 01:52 PM IST
Csk Robin Uthappa
IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప ఇప్పటి ఎల్లో ఆర్మీ తరపున తొలి క్యాప్ అందుకున్నాడు. 35ఏళ్ల ఊతప్ప జట్టు కోసం సర్వ శక్తులు ఒడ్డి ఆడతాడు. టీం కోసం ఏదైనా చేస్తాడు కూడా. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెన్నై.. బెంగళూరు మధ్య సెకండాఫ్ లో ఆరో మ్యాచ్ ఆడాయి.
ఈ మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ, సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనాకు సాయం అందిస్తున్నట్లుగా వీడియో రికార్డు అయింది. ధోనీతో పాటు రైనాల బ్యాట్స్, హెల్మెట్స్ మోసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీం స్పిరిట్ చూపించాడంటూ సీఎస్కే అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. మ్యాచ్ అయిపోయాక హెల్మెట్, బ్యాట్ అప్పగించేసిన ధోనీ మిగతా ప్లేయర్లతో మాట్లాడుతుండగా ఊతప్ప అవి అందుకుని వస్తూనే, మార్గం మధ్యలో ఉన్న రైనా బ్యాట్, హెల్మెట్ కూడా అందుకుని డ్రెస్సింగ్ రూంకు తీసుకెళ్లాడు.
?#WhistlePodu#csk pic.twitter.com/fPHWTP1yCZ
— Chakri Dhoni (@ChakriDhoni17) September 25, 2021
సీజన్ లో ఫస్టాఫ్ టఫ్ గా ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ యూఏఈ వేదికగా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకూ ధోనీ సేన ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులపై విజయ కేతనం ఎగరేసింది. ప్రస్తుతం లీగ్ పాయింట్ల పట్టికలో ఏడు మ్యాచ్ లు గెలిచి రెండో స్థానంలో నిలిచింది.
…………………………………..: పాకిస్థాన్.. అబద్దాలు ఇక చాలు..! ఐక్యరాజ్యసమితిలో స్నేహా దూబే వార్నింగ్
ఇక ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడేందుకు రెడీ అయింది. అబుదాబి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు ఆరంభం కానుంది.
