Ipl 2021 Uae Could Reportedly Host Indian Premier League 14 From September 15
IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్ని ఫ్రాంచైజీల ప్లేయర్లతో పాటు ఇతర స్టాఫ్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, సాహాలకు పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే ఆ ఐపీఎల్ సీజన్ సెకండాఫ్ కొనసాగించేలా కనిపిస్తుంది.
ఈ మేరకు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకూ యూఏఈ వేదికగా మిగిలిన సీజన్ ను పూర్తి చేయనున్నట్లు సమాచారం. దీని కోసం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ను ముందుగా పూర్తి చేయాలని బీసీసీఐ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మూడో టెస్టుకు నాలుగో టెస్టుకు మధ్య ఉన్న 9రోజుల గ్యాప్ కుదిస్తే ఇది సాధ్యపడుతుందని చెప్పుకొచ్చింది. అలా చేయడం వల్ల 30రోజుల టైం పీరియడ్ దొరుకుతుంది. ఆ సమయంలో టోర్నమెంట్ లో మిగిలిన భాగాన్ని పూర్తి చేసేయొచ్చు. దానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకపోతే మాత్రం నాకౌట్ మ్యాచ్ లు తర్వాత నిర్వహించాలి.
ఐపీఎల్ కొనసాగింపుపై తుది నిర్ణయం మటుకు ప్రత్యేక మీటింగ్ నిర్వహించి 2021 మే 29న ప్రకటిస్తారు. బీసీసీఐ సీఈఓ హేమంగ్ ఆమీన్ మీటింగ్ పెట్టేందుకే ఇంటరెస్ట్ గాఉన్నారని తెలుస్తోంది. దాంతో పాటు ఐపీఎల్ ను యూఏఈలో కానీ లేదంటే యూకేలోనైనా నిర్వహించాలని చూస్తున్నారు. గతంలో ఓసారి నిర్వహించింది కాబట్టి మళ్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కే బీసీసీఐ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.