Ipl 2021 Will Go On As Per Schedule Sourav Ganguly
Sourav Ganguly: దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్యాంప్ పై అనుమానాలు మొదలయ్యాయి. వీటిపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) ప్రెసిడెంట్ త్వరగానే రెస్పాండ్ అయ్యారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే.. ఐపీఎల్ 2021 జరిగి తీరుతుందని చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్ డౌన్ తప్పదని చెప్పిన వెంటనే గంగూలీ తమ నిర్ణయాన్ని చెప్పారు. మహారాష్ట్ర శుక్రవారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకూ లాక్ డౌన్ నిర్వహిస్తామని రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ ఆదివారం ప్రకటించారు.
అంతకంటే ముందు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. హెల్త్ మినిష్ట్రీతో టచ్ లో ఉంటున్నామని ప్లేయర్లందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ వేయిస్తామని చెప్పారు.
కరోనావైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో దానికి ఒక్కటే సొల్యూషన్ అని వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చెప్పారు. ప్లేయర్లు కచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందో ఎవరూ చెప్పలేరు. ప్లేయర్లంతా అంత ఈజీగా ఆడలేరు. వ్యాక్సినేషన్ వేయించాల్సిందే అని శుక్లా మీడియాతో అన్నారు. ఐపీఎల్ చెన్నై వేదికగా ఏప్రిల్ 9నుంచి మొదలవనుంది.