IPL 2022: ధోనీ వచ్చేశాడు.. సూపర్ కింగ్స్ సెటప్ రెడీ!
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. ఐపీఎల్ 2022 వేలానికి మరి కొద్ది వారాల గ్యాప్ ముందే ధోనీ ఇక్కడకు రావడం విశేషం.
- Subhan Ali Shaik
- Updated on- January 28, 2022 / 09:07 AM IST
ms-dhoni
IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. ఐపీఎల్ 2022 వేలానికి మరి కొద్ది వారాల గ్యాప్ ముందే ధోనీ ఇక్కడకు రావడం విశేషం. జనవరి 27న సౌత్ ఇండియన్ సిటీ హోటల్ లో చెక్ ఇన్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే వేలం గురించి యాజమాన్యంతో చర్చించేందుకే ధోనీ వచ్చి ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీలను మినహాయించి మిగిలిన వారందరినీ వేలానికి వదిలిపెట్టేసింది చెన్నై. జడేజాను రూ.16కోట్లకు రిటైన్ చేసుకోగా, ధోనీ రూ.12కోట్లు, మొయిన్ అలీ రూ.8కోట్లు, గైక్వాడ్ రూ.6కోట్లతో ఉన్నారు.
మెగా వేలానికి ముందు సీఎస్కే ఖాతాలో ఇంకా రూ.58కోట్లు ఉన్నాయి. బ్యాలెన్సింగ్ జట్టుతో బరిలోకి దిగాలని ధోనీ వ్యూహాలు రచిస్తున్నాడట. అంతా అతని రిటైర్మెంట్ గురించి ప్రశ్నిస్తుంటే అది కచ్చితంగా చెన్నై వేదికగా జరిగే మ్యాచ్ లోనే ఉంటుందని ధోనీ ఒక హింట్ ఇచ్చి వదిలేశాడు.
Read Also : దెయ్యాల రెస్టారెంట్
ఈ వేలం ద్వారా జట్టుకు 5 నుంచి 10ఏళ్ల వరకూ పనికొచ్చే ప్లేయర్లను ఎంపిక చేయాలని ధోనీ ప్లాన్ చేస్తున్నాడు. ‘నేను సీఎస్కేకు ఆడుతున్నానా.. లేదా.. అనేది కాదు విషయం. సీఎస్కేకు ఏది ఉత్తమమనేది చూడాలి. మరో పదేళ్ల పాటు జట్టుతో నడిచేవాళ్లు కావాలి’ అని ధోనీ వివరించాడు.
The ? goes ?, every single time! #ThalaDharisanam #WhistlePodu ? pic.twitter.com/IihZJsuDVQ
— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) January 27, 2022
