IPL 2022: కొత్త జెర్సీతో బరిలోకి దిగుతున్న సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ 15వ ఎడిషన్ కు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. మార్చి చివరి వారం మొదలుకానున్న సీజన్ లో ఆరెంజ్, బ్లాక్ కలర్స్ లో ఎస్సార్హెచ్ జెర్సీ మెరవనుంది.
- Subhan Ali Shaik
- Published On : February 9, 2022 / 09:40 PM IST
Srh Jersey
IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ 15వ ఎడిషన్ కు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. మార్చి చివరి వారం మొదలుకానున్న సీజన్ లో ఆరెంజ్, బ్లాక్ కలర్స్ లో ఎస్సార్హెచ్ జెర్సీ మెరవనుంది. బ్లాక్ స్లీవ్స్ తో ఆరంజ్ చుక్కలతో పాటు కాలర్, మెడ రెండూ పూర్తి నల్ల రంగులో ఉండగా మొత్తం ఆరెంజ్ కలర్ లో డిజైన్ చేశారు.
జెర్సీ ఫొటోను పోస్టు చేస్తూ.. ‘కొత్త జెర్సీని ప్రజెంట్ చేస్తున్నాం. ఆరంజ్ ఆర్మీ కోసమే ఇది’ అని ఎస్సార్ హెచ్ ట్వీట్ లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఫిబ్రవరి 9న పోస్టు చేయగా.. అదే రోజు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయంట్స్ జట్ల పేర్లు ప్రకటించారు.
ప్రస్తుత ఐపీఎల్ 15వ సీజన్‌లో 10జట్లు బరిలోకి రానున్నాయి. టోర్నీకి ముందు ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13న వేలం జరగనుంది. దీనికి గానూ 590మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో 228 క్యాప్ డ్ ప్లేయర్లు కాగా, 355 మంది అన్ క్యాప్ డ్ ప్లేయర్లతో పాటు ఏడుగురు అసోసియేట్ నేషన్స్ కు చెందిన వారు.
Read Also: ‘హిజాబ్ తలనే కప్పి ఉంచుతుంది.. బ్రెయిన్‌ను కాదు’
మెగా వేలానికి ముందు ఎనిమిది జట్లు గరిష్ఠంగా నలుగురు ప్లేయర్లను జట్టులో ఉంచుకోవచ్చని సూచించింది ఐపీఎల్ మేనేజ్మెంట్.
