Hijab Row: ‘హిజాబ్ తలనే కప్పి ఉంచుతుంది.. బ్రెయిన్‌ను కాదు’

'హిజాబ్ మా తలను మాత్రమే కప్పి ఉంచుతుంది. మా బ్రెయిన్ ను కాదు. హిజాబ్ ధరించినా క్లాసుల్లోకి అనుమతించాలి. మా రాజ్యాంగపరమైన హక్కుల కోసం అడుగుతున్నాం. అది నేరం కాదు కదా' అని అడిగింది.

Hijab Row: ‘హిజాబ్ తలనే కప్పి ఉంచుతుంది.. బ్రెయిన్‌ను కాదు’

Hija Ktk Em

Hijab Row: కర్ణాటక విద్యాశాఖ మంత్రితో హైకోర్టులో పిటిషన్ వేసిన యువతి మాట్లాడారు. తన రాజ్యాంగ హక్కులను డిఫెండ్ చేసుకుంటూ హాజ్రా షిఫా అనే యువతి.. ‘హిజాబ్ మా తలను మాత్రమే కప్పి ఉంచుతుంది. మా బ్రెయిన్ ను కాదు. హిజాబ్ ధరించినా క్లాసుల్లోకి అనుమతించాలి. మా రాజ్యాంగపరమైన హక్కుల కోసం అడుగుతున్నాం. అది నేరం కాదు కదా’ అని అడిగింది.

దానికి సమాధానం చెప్పని విద్యాశాఖ మంత్రి.. విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. కొన్ని ఆర్గనైజేషన్లు కావాలనే విద్యార్థులను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. ఇస్లామిక్ ఆర్గనైజేషన్లు అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాలపై ఆరోపణలను కొట్టిపారేసింది యువతి.

ముందుగా సింగిల్ బెంచ్ తో హిజాబ్ ధరించి క్లాసులకు హాజరవుతామని వేసిన పిటిషన్ విచారణ జరిగినా.. చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు పెద్ద బెంచ్ కు పిటిషన్ ను బదిలీ చేశారు.

Read Also: రాయచోటిని జిల్లా చేస్తేనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

కర్ణాటక సీఎం విద్యార్థులంతా శాంతి, సామరస్యంతో ఉండాలని పిలుపునిస్తూ మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూసేయాలని పిలుపునిచ్చారు.