IPL 2023: ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై ముంబై ఘన విజయం

IPL 2023: ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమితో లక్నో జట్టు కథ ముగిసింది. ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

LSG vs MI: డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు సత్తా చాటింది. క్వాలిఫయర్-2 బెర్తు కోసం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టును చిత్తు చేసింది. 81 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ బంతితో నిప్పులు చెరిగాడు. 5 వికెట్లు తీసి లక్నో ఓటమిని శాసించాడు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 24 May 2023 11:05 PM (IST)

    మద్వాల్ నిప్పులు.. 8వ వికెట్ డౌన్

    లక్నో జట్టు ఓటమి అంచున ఉంది. 100 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్ మద్వాల్ నిప్పులు చెరుగుతున్నాడు. 4 వికెట్లతో లక్నో జట్టుని దెబ్బకొట్టాడు.

  • 24 May 2023 10:56 PM (IST)

    7వ వికెట్ కూడా పాయె

    లక్నో పీకల్లోతు కష్టాల్లో పడింది. 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కృష్ణప్ప గౌతమ్(2) రనౌట్ అయ్యాడు.

  • 24 May 2023 10:52 PM (IST)

    12 ఓవర్లకు 90/6

    12 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.

  • 24 May 2023 10:51 PM (IST)

    6వ వికెట్ డౌన్.. స్టోయినిస్ రనౌట్

    లక్నో జట్టుకి మరో బిగ్ షాక్ తగిలింది. 6 వికెట్ కోల్పోయింది. స్టోయినిస్(40) రనౌట్ అయ్యాడు. 89 పరుగులకే లక్నో 6 వికెట్లు కోల్పోయింది.

  • 24 May 2023 10:42 PM (IST)

    లక్నోకి మరో బిగ్ షాక్.. పూరన్ డకౌట్

    లక్నో జట్టుకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. మరో వికెట్ కోల్పోయింది. నికోలస్ పూరన్ డకౌట్ అయ్యాడు. మద్వాల్ బౌలింగ్ లో అతడు ఔటయ్యాడు. 74 పరుగుల వద్దే 5 వికెట్ కూడా కోల్పోయింది.

  • 24 May 2023 10:38 PM (IST)

    లక్నోకి మరో షాక్.. బదోనీ ఔట్

    లక్నో జట్టు 4వ వికెట్ కోల్పోయింది. 74 పరగుల జట్టు స్కోర్ వద్దు ఆయుష్ బదోనీ(1) ఔటయ్యాడు.

  • 24 May 2023 10:33 PM (IST)

    9 ఓవర్లకు 74/3

    9 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.

  • 24 May 2023 10:31 PM (IST)

    కృనాల్ పాండ్య ఔట్

    69 పరుగుల జట్టు స్కోర్ వద్ద లక్నో జట్టు మూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్య(8) చావ్లా బౌలింగ్ లో ఔటయ్యాడు.

  • 24 May 2023 10:26 PM (IST)

    8 ఓవర్లకు 68/2

    8 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.

  • 24 May 2023 10:21 PM (IST)

    7 ఓవర్లకు స్కోర్ 65/2

    7 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. స్టోయినిస్ దంచి కొడుతున్నాడు. 16 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు.

  • 24 May 2023 10:14 PM (IST)

    6 ఓవర్లకు 54/2

    6 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది.

  • 24 May 2023 10:09 PM (IST)

    5 ఓవర్లకు లక్నో స్కోర్ 36/2

    5 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 2 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.

  • 24 May 2023 10:07 PM (IST)

    2 వికెట్లు కోల్పోయిన లక్నో

    183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నోకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కైలీ మేయర్స్(18), మన్కడ్(3) ఇద్దరూ ఔటయ్యారు.

  • 24 May 2023 09:53 PM (IST)

    ప్రేరక్ ఔట్

    లక్ష్యఛేదనలో రెండో ఓవర్లోనే లక్నో ఓపెనర్ ప్రేరక్ ఔట్ అయ్యాడు. 3 పరుగులు మాత్రమే చేసి ఆకాశ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. క్రీజులో మేయర్స్, కృనాల్ పాండ్యా ఉన్నారు.

  • 24 May 2023 09:27 PM (IST)

    లక్నో టార్గెట్ 183 పరుగులు

    లక్నో సూపర్ జెయింట్స్ ముందు ముంబై ఇండియన్స్ 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబై బ్యాటర్లలో కామెరూన్ 41, సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 26, నెహాల్ 23 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. దీంతో ముంబై స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 182/8 గా నమోదైంది.

  • 24 May 2023 09:14 PM (IST)

    6వ వికెట్ డౌన్

    ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయింది. తిలక్ వర్మ 26 పరుగులు చేసి ఔటయ్యాడు.

  • 24 May 2023 09:03 PM (IST)

    5వ వికెట్ డౌన్

    టిమ్ డేవిడ్ 13 పరుగులు చేసి యశ్ ఠాకూర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ముంబై స్కోరు 149/5 (17 ఓవర్లకు)గా ఉంది. 

  • 24 May 2023 08:53 PM (IST)

    16 ఓవర్లకు 141/4

    ముంబై ఇండియన్స్ స్కోరు 16 ఓవర్లకు 141/4గా ఉంది. క్రీజులో తిలక్ వర్మ 26, టిమ్ డేవిడ్ 9 పరుగులతో ఉన్నారు.

  • 24 May 2023 08:27 PM (IST)

    4 వికెట్లు కోల్పోయిన ముంబై

    ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ (33), కామెరూన్ (41) ఔట్ అయ్యారు. క్రీజులో తిలక్ వర్మ (9), టిమ్ డేవిడ్ (2) ఉన్నారు. 12 ఓవర్లకు స్కోరు 116/4గా ఉంది.

  • 24 May 2023 08:19 PM (IST)

    10 ఓవర్లలో 98/2

    ముంబై ఇండియన్స్ జట్టు 10 ఓవర్లలో 98/2 పరుగులు చేసింది. సూర్యకుమార్ (27), కామెరూన్ (41) క్రీజులో ఉన్నారు.

  • 24 May 2023 07:57 PM (IST)

    6 ఓవర్లలో 62/2 పరుగులు

    ముంబై ఇండియన్స్ జట్టు 6 ఓవర్లలో 62/2 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ (9), కామెరూన్ (23) ఉన్నారు.

  • 24 May 2023 07:53 PM (IST)

    ఇషాంత్ ఔట్

    ఇషాంత్ కిషన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్ లో నికోలస్ కు ఇషాంత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 24 May 2023 07:44 PM (IST)

    రోహిత్ శర్మ ఔట్

    ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ముంబై స్కోరు 30/1 (3.2 ఓవర్లు) వద్ద రోహిత్... నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 

  • 24 May 2023 07:11 PM (IST)

    కృనాల్ పాండ్యా సేన

    లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు: ఆయుశ్ బడోని, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్

  • 24 May 2023 07:08 PM (IST)

    రోహిత్ సేన

    ముంబై ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్, ఆకాశ్

  • 24 May 2023 07:04 PM (IST)

    ముంబై ఇండియన్స్ బ్యాటింగ్

    ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మైదానం పరిస్థితుల దృష్ట్యా మొదట బ్యాటింగే చేయాలని తాము భావిస్తున్నామని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు