IPL 2023, MI vs CSK
IPL 2023, MI vs CSK: ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబైపై చెన్నై విజయం సాధించింది. సీఎస్కే బ్యాటర్ అజింక్య రహానె రెచ్చిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది
ఈ సీజన్ లో ముంబై మళ్లీ ఓడింది. వరుసగా రెండో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 158 పరుగుల టార్గెట్ ను 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.
18 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై జట్టు 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
16 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై జట్టు 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
125 పరుగుల జట్టు స్కోర్ వద్దు చెన్నై జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన శివమ్ దూబే(26 బంతుల్లో 28 పరుగులు) కార్తికేయ ఔట్ చేశాడు.
13 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై జట్టు 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన రహానె (27 బంతుల్లో 67 పరుగులు) చావ్లా బౌలింగ్ లో ఔటయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కాన్వె తొలి ఓవర్ నాలుగో బంతికే డకౌట్ గా జాసోన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ (3), అజింక్యా రహానె 37 పరుగులతో ఉన్నారు. చెన్నై స్కోరు 46/1గా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ ముందు ముంబై ఇండియన్స్ 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబై ఇండియన్స్ జట్టులో ఇషాన్ కిషన్ 32, టిమ్ డేవిడ్ 31, తిలక్ వర్మ 22, రోహిత్ శర్మ 21 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై స్కోరు 157/8 గా నమోదైంది.
ముంబై ఇండియన్స్ 8 వికెట్లు కోల్పోయింది. డేవిడ్ 31, స్టబ్స్ 5 పరుగులు చేసి ఔటయ్యారు.
ముంబై ఆరో వికెట్ కోల్పోయింది. తిలక్ వర్మ కూడా ఔటయ్యాడు. 22 పరుగులు చేసిన తిలక్ వర్మ రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఎల్బీడబ్య్లూగా వెనుదిరిగాడు.
ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయింది. అర్షద్ ఖాన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు.
ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కూడా కోల్పోయింది. కామెరూన్ గ్రీన్ 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై ఇండియన్స్ స్కోరు 76/4 (9 ఓవర్లకు)గా ఉంది.
ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 21, ఇషాన్ కిషన్ 32, సూర్య కుమార్ యాదవ్ 1 పరుగు చేసి ఔటయ్యారు.
ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ (14), ఇషాన్ కిషన్ (14) క్రీజులో ఉన్నారు. తొలి మూడు ఓవర్లలో రోహిత్ శర్మ , ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడారు. ముంబై ఇండియన్స్ జట్టు స్కోరు 3 ఓవర్లలో 30 పరుగులు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ధోనీ(కెప్టెన్), శివమ్ దూబె, డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చాహెర్, మిచెల్ శాంట్నర్, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే
ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్
చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచింది. మొదట ఫీల్డింగ్ చేస్తామని ఆ జట్టు కెప్టెన్ ధోనీ చెప్పాడు.