×
Ad

IPL 2023 MI Vs LSG : మద్వాల్ విజృంభణ.. లక్నో ఇంటికి, ముంబై ముందుకి..

IPL 2023 MI Vs LSG : మే 26న అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ తో ముంబై తలపడనుంది.

  • Published On : May 24, 2023 / 11:19 PM IST

MI Vs LSG

IPL 2023 MI Vs LSG : డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు సత్తా చాటింది. క్వాలిఫయర్-2 బెర్తు కోసం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టును 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ బంతితో నిప్పులు చెరిగాడు. 5 వికెట్లు తీసి లక్నో ఓటమిని శాసించాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. 183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో జట్టు.. 16.3 ఓవర్లలోనే 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మార్కస్ స్టోయినిస్ ఒక్కడే రాణించాడు. 27 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లక్నో జట్టులో ముగ్గురు బ్యాటర్లు రనౌట్ అయ్యారు.

Also Read..IPL 2023: ఈ ముగ్గురిలో ఆరెంజ్ క్యాప్ ఎవరికి? పక్కా అతడికే అంటున్న ఫ్యాన్స్

ముంబై బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ 5 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ జోర్డాన్, పియూశ్ చావ్లా తలో వికెట్ తీశారు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమితో లక్నో జట్టు కథ ముగిసింది. ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మే 26న అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ తో ముంబై తలపడనుంది.