IPL 2023, PBKS vs LSG: పంజాబ్‌పై ల‌క్నో ఘ‌న విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘ‌న విజ‌యం సాధించింది.

PBKS vs LSG

IPL 2023, PBKS vs LSG: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘ‌న విజ‌యం సాధించింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన పంజాబ్ 19.5 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. దీంతో ల‌క్నో 56 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో అథర్వ తైదే(66; 36 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. ల‌క్నో బౌలర్ల‌లో యష్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయ‌గా నవీన్-ఉల్-హక్ మూడు, ర‌వి బిష్ణోయ్ రెండు, మార్క‌స్ స్టోయిస్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 28 Apr 2023 11:31 PM (IST)

    ల‌క్నో ఘ‌న విజ‌యం

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘ‌న విజ‌యం సాధించింది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన పంజాబ్ 19.5 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది.

  • 28 Apr 2023 11:21 PM (IST)

    రెండు బంతుల్లో రెండు వికెట్లు

    వ‌రుస బంతుల్లో యష్ ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు. ఐదో బంతికి రాహుల్ క్యాచ్ అందుకోవ‌డంతో జితేశ్ శ‌ర్మ‌(24) ఔట్ కాగా ఆరో బంతికి రాహుల్ చాహ‌ర్(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 18 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 193/8.

  • 28 Apr 2023 11:14 PM (IST)

    సామ్ క‌ర‌ణ్ ఔట్‌

    నవీన్-ఉల్-హక్ బౌలింగ్‌లో సామ్‌క‌ర‌ణ్(21) బ‌దోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 178 ప‌రుగుల(16.6వ ఓవ‌ర్‌) వ‌ద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది.17 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 178/6. జితేశ్ శ‌ర్మ‌(11) క్రీజులో ఉన్నాడు.

  • 28 Apr 2023 11:01 PM (IST)

    లివింగ్‌స్టోన్ ఔట్‌

    ర‌విబిష్ణోయ్ బౌలింగ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్(23) ఎల్బీగా ఔట్ అయ్యాడు. దీంతో 152 ప‌రుగుల(15.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది.16 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 166/5. సామ్ క‌ర‌ణ్(15), జితేశ్ శ‌ర్మ‌(7) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 10:48 PM (IST)

    అథర్వ తైదే ఔట్‌

    పంజాబ్ మ‌రో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న అథర్వ తైదే(66) ఔట్ అయ్యాడు. ర‌విబిష్ణోయ్ బౌలింగ్‌లో అత‌డే క్యాచ్ ప‌ట్ట‌డంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 127/4. లియామ్ లివింగ్‌స్టోన్(9), సామ్ క‌ర‌ణ్‌(0) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 10:43 PM (IST)

    సికింద‌ర్ ర‌జా ఔట్‌

    పంజాబ్ మ‌రో వికెట్ కోల్పోయింది. యష్ ఠాకూర్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి సికింద‌ర్ ర‌జా(36) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 109 ప‌రుగుల(11.3వ ఓవ‌ర్‌)వ‌ద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 118/3. లియామ్ లివింగ్‌స్టోన్(1), అథర్వ తైదే(65) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 10:39 PM (IST)

    సికింద‌ర్ ర‌జా సిక్స్‌, ఫోర్‌

    11వ ఓవ‌ర్ వేసిన ర‌వి బిష్ణోయ్ బౌలింగ్ ఆఖ‌రి రెండు బంతుల‌ను ఫోర్‌, సిక్స్‌గా మ‌లిచాడు సికింద‌ర్ ర‌జా. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 106/2. సికందర్ రజా(36), అథర్వ తైదే(54) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 10:33 PM (IST)

    అథర్వ తైదే అర్ధ‌శ‌త‌కం

    యష్ ఠాకూర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో అథర్వ తైదే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 93/2. సికందర్ రజా(24), అథర్వ తైదే(53) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 10:27 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న అథర్వ తైదే

    తొమ్మిదో ఓవ‌ర్‌ను అమిత్ మిశ్రా వేశాడు. మూడో బంతికి అథర్వ తైదే ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 84/2. సికందర్ రజా(20), అథర్వ తైదే(49) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 10:23 PM (IST)

    6 ప‌రుగులు

    ర‌వి బిష్ణోయ్ వేసిన ఎనిమిద ఓవ‌ర్‌లో సికింద‌ర్ ర‌జా ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 6 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 76/2. సికందర్ రజా(18), అథర్వ తైదే(43) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 10:20 PM (IST)

    అథర్వ తైదే సిక్స్‌, సికింద‌ర్ ర‌జా ఫోర్‌

    అమిత్ మిశ్రా వేసిన ఏడో ఓవ‌ర్‌లో అథర్వ తైదే సిక్స్‌, సికింద‌ర్ ర‌జా ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 15 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 70/2. సికందర్ రజా(13), అథర్వ తైదే(42) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 10:13 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. నవీన్-ఉల్-హక్ వేసిన ఆరో ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 55/2. సికందర్ రజా(8), అథర్వ తైదే(32) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 10:07 PM (IST)

    అథర్వ తైదే మూడు ఫోర్లు

    నాలుగో ఓవ‌ర్‌ను అవేష్ ఖాన్ వేశాడు. అథర్వ తైదే మూడు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 47/2. సికందర్ రజా(1), అథర్వ తైదే(31) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 10:02 PM (IST)

    ప్రభసిమ్రాన్ సింగ్ ఔట్

    పంజాబ్ మ‌రో వికెట్ కోల్పోయింది. నవీన్-ఉల్-హక్ బౌలింగ్‌లో ప్రభసిమ్రాన్ సింగ్(9) డేనియ‌ల్ సామ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 31 ప‌రుగుల వ‌ద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 31/2. సికందర్ రజా(0), అథర్వ తైదే(16) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 09:56 PM (IST)

    పంజాబ్‌కు షాక్‌.. శిఖ‌ర్ ఔట్‌

    భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలోనే ఓ వికెట్ కోల్పోయింది. శిఖ‌ర్ ధావ‌న్ 1 ప‌రుగుకే పెవిలియ‌న్ చేరుకున్నాడు. 3 ఓవ‌ర్ల‌కు పంజాబ్ స్కోరు 26/1. ప్రభసిమ్రాన్ సింగ్(5), అథర్వ తైదే(15) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 09:21 PM (IST)

    పంజాబ్ ల‌క్ష్యం 258

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. ఒక్క కేఎల్ రాహుల్(12) మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు దంచికొట్ట‌డంతో ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది. స్టోయినిస్‌(73; 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), కైల్ మేయ‌ర్స్‌(54; 24 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాల‌తో విధ్వంస‌కర‌ ఇన్నింగ్స్‌లు ఆడ‌గా ఆయుష్ బ‌దోని(43; 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), నికోల‌స్ పూర‌న్‌(45; 18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించ‌డంతో పంజాబ్ ముందు భారీ ల‌క్ష్యం నిలిచింది.

  • 28 Apr 2023 09:10 PM (IST)

    స్టోయినిస్ ఔట్‌

    ల‌క్నో మ‌రో వికెట్ కోల్పోయింది. సామ్ క‌ర‌ణ్ బౌలింగ్‌లో స్టోయినిస్‌(73) జితేశ్ శ‌ర్మ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 239 ప‌రుగుల(18.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద ల‌క్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 19 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోరు 245/4. నికోల‌స్ పూర‌న్‌(44), దీప‌క్ హుడా(6) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 09:08 PM (IST)

    19 ప‌రుగులు

    18వ ఓవ‌ర్‌ను రబాడ వేశారు. స్టోయినిస్ ఓ సిక్స్ కొట్ట‌గా పూర‌న్ ఓ ఫోర్‌, సిక్స్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 19 ప‌రుగులు వ‌చ్చాయి. 18 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోరు 235/3. నికోల‌స్ పూర‌న్‌(44), మార్కస్ స్టోయినిస్(69) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 09:03 PM (IST)

    మూడు ఫోర్లు

    17వ ఓవ‌ర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. రెండో బంతికి స్టోయినిస్‌, ఆఖ‌రి రెండు బంతుల‌కు పూర‌న్ ఫోర్లు కొట్టారు. ఈ ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోరు 216/3. నికోల‌స్ పూర‌న్‌(32), మార్కస్ స్టోయినిస్(62) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 08:56 PM (IST)

    200 ధాటిన ల‌క్నో స్కోరు

    రబాడ వేసిన ప‌ద‌హారో ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో ల‌క్నో స్కోరు 200 దాటింది. 16 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోరు 200/3. నికోల‌స్ పూర‌న్‌(21), మార్కస్ స్టోయినిస్(57) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 08:47 PM (IST)

    స్టోయినిస్ అర్ధ‌శ‌త‌కం

    అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో(14.3వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో స్టోయినిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • 28 Apr 2023 08:42 PM (IST)

    బ‌దోని ఔట్

    ల‌క్నో మ‌రో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న బ‌దోని(43) ఔట్ అయ్యాడు. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన బ‌దోని అదే ఊపులో మ‌రో భారీ షాట్‌కు య‌త్నించగా రాహుల్ చాహ‌ర్ చేతికి చిక్కాడు. దీంతో 163 ప‌రుగుల(13.3వ ఓవ‌ర్‌)వ‌ద్ద ల‌క్నో మూడో వికెట్ కోల్పోయింది. వ‌చ్చి రావ‌డంతో నికోల‌స్ పూర‌న్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 19 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోరు 175/3. నికోల‌స్ పూర‌న్‌(12), మార్కస్ స్టోయినిస్(48) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 08:39 PM (IST)

    బ‌తికిపోయిన స్టోయినిస్‌

    రాహుల్ చాహ‌ర్ బౌలింగ్‌లో రెండో బంతికి స్టోయినిస్ భారీ షాట్ కొట్టాడు. లిలియామ్ లివింగ్‌స్టోన్ క్యాచ్ ప‌ట్టుకున్నాడు. అయితే.. అత‌డి పాదం బౌండ‌రీ లైన్‌ను ట‌చ్ కావడంతో థ‌ర్డ్ అంపైర్ సిక్స్ ఇచ్చాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు 156/2. ఆయుష్ బదోని(37), మార్కస్ స్టోయినిస్(47) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 08:33 PM (IST)

    స్టోయినిస్ సిక్స్‌

    సామ్ క‌ర‌న్ బౌలింగ్‌లో స్టోయినిస్ ఓ సిక్స్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు 147/2. ఆయుష్ బదోని(36), మార్కస్ స్టోయినిస్(39) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 08:27 PM (IST)

    8 ప‌రుగులు

    ప‌ద‌కొండో ఓవ‌ర్‌ను రాహుల్ చాహ‌ర్ వేయ‌గా నాలుగో బంతికి స్టోయినిస్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు 136/2. ఆయుష్ బదోని(34), మార్కస్ స్టోయినిస్(30) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 08:24 PM (IST)

    స్టోయినిస్ రెండు ఫోర్లు, బ‌దోని సిక్స్‌

    సామ్ క‌ర‌ణ్ ప‌దో ఓవ‌ర్‌ను వేయ‌గా రెండో బంతికి స్టోయినిస్ ఫోర్ కొట్ట‌గా నాలుగో బంతికి బ‌దోని సిక్స్ బాదాడు. ఆఖ‌రి బంతికి స్టోయినిస్ మ‌రో ఫోర్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు 128/2. ఆయుష్ బదోని(31), మార్కస్ స్టోయినిస్(25) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 08:17 PM (IST)

    4 ప‌రుగులు

    తొమ్మిదో ఓవ‌ర్‌ను రాహుల్ చాహ‌ర్‌ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 4 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు 111/2. ఆయుష్ బదోని(23), మార్కస్ స్టోయినిస్(16) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 08:13 PM (IST)

    24 ప‌రుగులు

    ఎనిమిదో ఓవ‌ర్‌ను గుర్నూర్ బ్రార్ వేశాడు. బ‌దోని ఫోర్, సిక్స్ కొట్ట‌గా సోయినిస్ ఓ సిక్స్‌, ఫోర్ బాదాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 24 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు 107/2. ఆయుష్ బదోని(21), మార్కస్ స్టోయినిస్(14) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 08:07 PM (IST)

    బ‌దోని ఫోర్‌

    ఏడో ఓవ‌ర్‌ను రాహుల్ చాహ‌ర్ వేశాడు. తొలి బంతికి బ‌దోని ఫోర్ బాద‌గా మొత్తంగా 9 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు 83/2. ఆయుష్ బదోని(10), మార్కస్ స్టోయినిస్(3) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 08:02 PM (IST)

    సిక్స్‌తో మేయ‌ర్స్ అర్ధ‌శ‌త‌కం.. ఆ వెంట‌నే ఔట్‌

    ర‌బాడా బౌలింగ్‌లో సిక్స్‌తో కైల్ మేయ‌ర్స్ 20 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. ఆ త‌రువాత ఓ ఫోర్ కొట్టాడు. ఐదో బంతికి ధావ‌న్ క్యాచ్ ప‌ట్ట‌డంతో మేయ‌ర్స్(54) ఔట్ అయ్యాడు. దీంతో 74 ప‌రుగుల వ‌ద్ద ల‌క్నో రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు /2. ఆయుష్ బదోని(4), మార్కస్ స్టోయినిస్(0) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 07:55 PM (IST)

    మేయ‌ర్స్ రెండు సిక్స్‌లు, ఓఫోర్‌

    కైల్ మేయ‌ర్స్ ధాటిగా ఆడుతున్నాడు. సికందర్ రజా వేసిన నాలుగో ఓవ‌ర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తం 17 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 62/1. ఆయుష్ బదోని(4), కైల్ మేయర్స్(44) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 07:52 PM (IST)

    రాహుల్ ఔట్‌

    ల‌క్నో జ‌ట్టుకు షాక్ త‌గిలింది. కేఎల్ రాహుల్ ఔట్(12) అయ్యాడు. ర‌బాడా బౌలింగ్‌లో షారుక్‌ఖాన్ క్యాచ్ అందుకోవ‌డంతో ల‌క్నో 41 ప‌రుగుల(3.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 4 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 45/1. ఆయుష్ బదోని(4), కైల్ మేయర్స్(27) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 07:48 PM (IST)

    మేయ‌ర్స్ దూకుడు

    మూడో ఓవ‌ర్‌ను గుర్నూర్ బ్రార్ వేశాడు. మేయ‌ర్ ఓ సిక్స్‌, ఫోర్ కొట్ట‌గా రాహుల్ ఓ ఫోర్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 16 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 35/0.

  • 28 Apr 2023 07:40 PM (IST)

    కైల్ మేయర్స్ నాలుగు ఫోర్లు

    రెండో ఓవ‌ర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. కైల్ మేయ‌ర్స్ రెండు ఫోర్లు కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 19/0. కేఎల్‌ రాహుల్(1), కైల్ మేయర్స్(17) క్రీజులో ఉన్నారు.

  • 28 Apr 2023 07:36 PM (IST)

    తొలి ఓవ‌ర్‌లో రెండు ప‌రుగులు

    టాస్ ఓడిన ల‌క్నో బ్యాటింగ్‌కు దిగింది. కేఎల్‌ రాహుల్, కైల్ మేయర్స్ లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్‌ను గుర్నూర్ బ్రార్ వేయ‌గా రెండు పరుగులు వ‌చ్చాయి.

  • 28 Apr 2023 07:12 PM (IST)

    లక్నో సూపర్ జెయింట్స్ తుది జ‌ట్టు

    కేఎల్‌ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీప‌ర్‌), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, యశ్ ఠాకూర్

  • 28 Apr 2023 07:11 PM (IST)

    పంజాబ్ కింగ్స్ తుది జ‌ట్టు

    అథర్వ తైదే, శిఖర్ ధావన్(కెప్టెన్‌), సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), షారుక్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

  • 28 Apr 2023 07:05 PM (IST)

    టాస్ గెలిచిన పంజాబ్‌

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కార‌ణంగా కొన్ని మ్యాచుల‌కు దూరంగా ఉన్న పంజాబ్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ తిరిగివ‌చ్చేశాడు

ట్రెండింగ్ వార్తలు