IPL2023: ఐపీఎల్ విజేతకు ఎన్నికోట్లంటే..? ఆరెంజ్, పర్పుల్ క్యాప్ ఆటగాళ్లకి ఎంతిస్తారంటే..?
అంచెలంచెలుగా ఎదుగుతున్న ఐపీఎల్‌లో ప్రైజ్‌మనీ సైతం పెరుగుతోంది. మొదటి రెండు సీజన్లలో విజేతకు రూ.4.8 కోట్లు, రన్నరప్‌కు రూ.2.4కోట్లు లభించాయి.
- Thota Vamshi Kumar
- Published On : May 27, 2023 / 05:04 PM IST
IPL 2023 Prize Money
IPL2023 Prize Money: ఐపీఎల్ 2023 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో మే 28 ఆదివారం రోజున జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధిస్తే వరుసగా రెండో సారి టైటిల్‌ను అందుకోనుండగా చెన్నై గెలిస్తే ఐదో సారి కప్పును ముద్దాడనుంది.
ఇదిలా ఉంటే.. విజేతగా నిలిచిన జట్టుకు, రన్నరప్ కు ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారు అన్న సంగతి ఓ సారి చూద్దాం. అంచెలంచెలుగా ఎదుగుతున్న ఐపీఎల్‌లో ప్రైజ్‌మనీ సైతం పెరుగుతోంది. మొదటి రెండు సీజన్లలో విజేతకు రూ.4.8 కోట్లు, రన్నరప్‌కు రూ.2.4కోట్లు లభించాయి. 2022 సీజన్‌లో విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ రూ.20 కోట్లు గెలుచుకోగా, రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.13 కోట్లు దక్కాయి.
IPL 2023: ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసిఉంటే రోహిత్ సేన విజయం సాధించేదా? అసలు ఇషాన్‌కు ఏమైంది..
స్పోర్ట్‌స్టార్‌లోని ఓ నివేదిక ప్రకారం ఈ సారి కూడా విజేతగా నిలిచిన జట్టుకు రూ.20 కోట్లు అందనుండగా, రన్నరప్‌కు రూ.13 కోట్లు దక్కనున్నాయి. ఇక ఎలిమినేటర్‌లో గెలిచిన ముంబైకు రూ.7 కోట్లు, ఓడిపోయిన లక్నోకు రూ.6.5కోట్లు లభించనున్నాయి.
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విజేతలకు ఎంతంటే..?
సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌కి పర్పుల్ క్యాప్ ఇస్తారు అన్న సంగతి తెలిసిందే. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు ఒక్కొక్కరికి రూ.15లక్షలు ఇవ్వనున్నారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఆటగాడికి రూ. 20 లక్షలు అందనున్నాయి. ఈ సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడికి రూ. 12 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. సూపర్ స్ట్రైక్ అవార్డు గెలుచుకున్న ప్లేయర్‌కి రూ.15లక్షలు, అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడికి రూ. 12 లక్షలు, సీజన్ గేమ్ ఛేంజర్ ఆటగాడికి రూ. 12 లక్షలు ప్రైజ్‌మనీని ఇవ్వనున్నారు.
IPL2023: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్.. టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు..!
