కమిన్స్ రికార్డును బద్దలు కొట్టిన స్టార్క్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర.. ఎంతో తెలుసా..?
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
- Thota Vamshi Kumar
- Updated on- December 19, 2023 / 04:25 PM IST
Mitchell Starc
Mitchell Starc : ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ధర పెరిగిపోవడంతో మిగిలిన ఫ్రాంచైజీలు పక్కకు తప్పుకోగా అధిక పర్స్ వాల్యూ ఉన్న గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఎలాగైనా అతడిని సొంతం చేసుకోవాలని భావించాయి.
ఈ క్రమంలో అతడి ధర అమాంతం పెరిగింది. చివరకు అతడిని రూ. 24.75 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. ఇదే వేలంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు దక్కించుకుని చరిత్ర సృష్టించగా మిచెల్ స్టార్స్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
Also Read: గతేడాది అమ్ముడుపోలేదు.. ఇప్పుడేమో ఏకంగా రూ.14 కోట్లు.. డారిల్ మిచెల్‌పై కనకవర్షం..
