హర్షిత్ రానా తన తల్లిండ్రుల గురించి కీలక విషయాన్ని చెప్పాడు.. అదేమిటంటే!

హర్షిత్ రానా అద్భుత ప్రదర్శనపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆఖరి ఓవర్లో హర్షిత్ రానా నుంచి కొంత సాహసోపేతమైన బౌలింగ్ ..

Harshit Rana

Harshit Rana : ఐపీఎల్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. శనివారం రాత్రి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వర్సెస్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జట్ల మధ్య మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా చివరి ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో ఎస్ఆర్ హెచ్ విజయం సాధించాలంటే 13 పరుగులు సాధించాల్సి ఉంది. అప్పటికే విధ్వంసకర ఫామ్ లో హన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. సన్ రైజర్స్ జట్టు విజయం ఖాయమని అందరూ భావిస్తున్న సమయంలో హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ తో రెండు వికెట్లు తీశాడు. ఫలితంగా చివరి ఓవర్లో వరుసగా 6,1,W,1,W,0 తో కేకేఆర్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.

Also Read : IPL 2024 : పాపం కావ్య పాప..! నాలుగు బంతుల్లో మారిపోయిన రియాక్షన్.. వీడియో వైరల్

హర్షిత్ రానా అద్భుత ప్రదర్శనపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆఖరి ఓవర్లో హర్షిత్ రానా నుంచి కొంత సాహసోపేతమైన బౌలింగ్ మ్యాచ్ ను విజయవంతంగా ముగించడానికి సహాయపడిందని అన్నారు. రానా యార్కర్ కు బదులు క్లాసెన్ కు స్లోబాల్ వేయడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని సచిన్ అన్నారు. హర్షిత్ ప్రదర్శనపై పలువురు క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. అయితే, మ్యాచ్ అనంతరం హర్షిత్ రానా మాట్లాడుతూ.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. నా తల్లిదండ్రులు మ్యాచ్ ను చూడటానికి మైదానంకు వచ్చారు. వారు నా ఆటను చూడటానికి మైదానంకు వచ్చినప్పుడల్లా నేను చెడుగా రాణిస్తానని భావించేవాడని. కానీ, ఈ మ్యాచ్ లో అలా జరగకపోవటం ఆనందంగా ఉంది అంటూ పేర్కొన్నాడు.

Also Read : IPL 2024 : కేకేఆర్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన హర్షిత్ రానాకు బిగ్‌షాక్‌!

22ఏళ్ల హర్షిత్ రాణా ఢిల్లీ నివాసి. అతను ఢిల్లీ తరపున దేశవాలీ క్రికెట్ ఆడతాడు. ఇప్పటి వరకు ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 28 వికెట్లు తీయగా.. 14 లిస్ట్ ఎ మ్యాచ్ లలో 22 వికెట్లు తీశాడు. అంతేకాక 13టీ 20 మ్యాచ్ లు ఆడిన అతను 12 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కేకేఆర్ జట్టులో చేరడానికి ముందు హర్షిత్ ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరపున నెట్ బౌలర్. 2022లో కేకేఆర్ తరపున హర్షిత్ రానా ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. 2023లో ఆరు మ్యాచ్ లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. 2024 ఐపీఎల్ టోర్నీలో తొలి మ్యాచ్ లోనే అద్భుత ప్రదర్శనతో హర్షిత్ రానా ఆకట్టుకున్నాడు.