IPL 2024 : రోహిత్ శర్మ ఔట్ అవ్వగానే కావ్య పాప సూపర్ డ్యాన్స్.. వీడియోలు వైరల్

ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

Kavya Maran Reaction MI vs SRH Match : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేసింది. ఆది నుంచి సన్‌రైజర్స్ బ్యాటర్లు ముంబై జట్టు బౌలర్లను ఊచకోత కోశారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. హెడ్ 62, అభిషేక్ 63, క్లాసెన్ నాటౌట్ 80 పరుగులతో స్టేడియం నలువైపుల ఫోర్ల వర్షం కురిపించారు. దీంతో సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ (277) నమోదు చేసింది.

Also Read : IPL 2024 : ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ హంగామా

278 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు బ్యాటర్లు సైతం ఆది నుంచి సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ సిక్సర్ల వర్షం కురిపించారు. 34 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ ఔట్ అయ్యాడు. కొద్దిసేపటికే రోహిత్ శర్మ (26 పరుగులు) ఔట్ అయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ విజయం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ జట్టు యాజమాని కావ్య మారన్ సంతోషంతో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : హైదరాబాద్ బోణీ.. ముంబైపై గ్రాండ్ విక్టరీ

కావ్య మారన్ మ్యాచ్ ప్రారంభం నుంచి సంతోషంగా గెంతులేస్తూ కనిపించారు. సన్‌రైజర్స్ బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తుండటంతో స్టేడియం స్టాండ్స్ లో కూర్చొని కావ్య హల్ చల్ చేశారు. మామూలుగా సన్‌రైజర్స్ మ్యాచ్ అంటేనే కెమెరాలన్నీ కావ్య మారన్ వైపు వెళ్తారు. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో మైదానంలో సన్‌రైజర్స్ జట్టు బ్యాటర్లు సిక్స్ కొట్టినప్పుడల్లా కెమెరాలన్నీ కావ్య వైపుకు వెళ్లిపోవటం కనిపించింది. ఆ స్థాయిలో కావ్య మారన్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

 

ట్రెండింగ్ వార్తలు