RCB : వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న బెంగ‌ళూరు.. కెప్టెన్ డుఫ్లెసిస్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చిన బీసీసీఐ

ఓట‌మి బాధ‌లో ఉన్న ఆర్‌సీబీకి భారీ షాక్ త‌గిలింది.

RCB Capation Faf Du Plessis : ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఆదివారం కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేద‌కగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన పోరులో ఒక్క ప‌రుగు తేడాతో కోల్‌క‌తా విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా మొద‌ట బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (50; 36 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌), ఫిల్ సాల్ట్ (48; 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) లు రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కోల్‌క‌తా ఆరు వికెట్లు కోల్పోయి 222 ప‌రుగులు చేసింది.

అనంత‌రం భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 221 ప‌రుగుల‌కు ఆలౌటైంది. విల్ జాక్స్ ( 55; 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), ర‌జ‌త్ పాటిదార్ (52; 23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) మెరుపు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించిన‌ప్ప‌టికీ ఒక్క ప‌రుగు తేడాతో ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ ఓట‌మితో బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్ ఆశ‌లు అడుగంటాయి.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ చెప్పాక చేసేదేముంది..! ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌లో మార్పుల‌కు బీసీసీఐ క‌స‌ర‌త్తులు..?

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది మ్యాచుల‌ను ఆడింది ఆర్‌సీబీ. ఇందులో ఒక్క మ్యాచుల్లోనే విజ‌యం సాధించింది. మిగిలిన ఏడు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో కేవ‌లం రెండు పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకోవ‌డం అసాధ్యం. ఒక వేళ ఆర్‌సీబీ మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిస్తే అప్పుడు ఆ జ‌ట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అప్పుడు మిగిలిన జట్ల సమీక‌ర‌ణాలు కూడా క‌లిసి వ‌స్తేనే ఫ్లే ఆఫ్స్‌కు వెళ్ల‌నుంది.

ఇదిలా ఉంటే.. ఓట‌మి బాధ‌లో ఉన్న ఆర్‌సీబీకి భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు రూ.12ల‌క్ష‌ల జ‌రిమానా ప‌డింది. కోల్‌క‌తా మ్యాచ్‌లో నిర్ణీత స‌మ‌యంలో ఆర్‌సీబీ ఓవ‌ర్ల‌ను పూర్తి చేయ‌డంలో విఫ‌లమైంది. ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీకి ఇదే తొలి త‌ప్పు కావ‌డంతో కెప్టెన్‌కు 12ల‌క్ష‌ల ఫైన్ ప‌డింది. మ‌రోసారి ఇదే త‌ప్పు పున‌రావృత‌మైతే.. అప్పుడు కెప్టెన్ రూ.24ల‌క్ష‌ల జ‌రిమానాతో ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోని మిగిలిన ఆట‌గాళ్లకు మ్యాచ్‌లో ఫీజులో 25 శాతం లేదంటే 6 ల‌క్ష‌లు రెండింటిలో ఏది త‌క్కువ అయితే దాన్నిజ‌రిమానా వేస్తారు.

Rajinikanth : సూప‌ర్ స్టార్ రజినీకాంత్ కోరిక తీర్చిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..! త‌లైవా ఫుల్ హ్యాపీ..!

ట్రెండింగ్ వార్తలు