Rohit Sharma : రోహిత్ శర్మ చెప్పాక చేసేదేముంది..! ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌లో మార్పులకు బీసీసీఐ కసరత్తులు..?
ఐపీఎల్‌లోని ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి చెప్పాల్సిన పని లేదు.

Rohit Sharma Openly Criticises Impact Player Rule BCCI Responds
Rohit Sharma – Impact Rule : ఐపీఎల్‌లోని ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్‌లో ఏ సందర్భంలోనైనా అదనంగా బౌలర్ లేదా బ్యాటర్‌ను తీసుకునే వెసులుబాటు దీని ద్వారా కలుగుతోంది. ఈ రూల్ కారణంగా మ్యాచ్ ఫలితాలు తారుమారైన సందర్భాలు ఉన్నాయి. ఈ రూల్ పై టీమ్ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనను ఆకట్టుకోలేదని చెప్పాడు. ఈ రూల్ వల్ల ఆల్‌రౌండర్ల వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ రూల్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీసీసీఐ అలర్టైంది. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యలను గమనించామని చెప్పాడు.
Dinesh Karthik : ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత.. ధోని, రోహిత్ తరువాత అతనే..
తప్పకుండా వాటిపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించాడు. ప్రాంఛైజీలు, కమిటీ సభ్యులతో చర్చించి దీనిపై ఓ నిర్ణయానికి రానున్నట్లు వివరించాడు. ఇంపాక్ట్ రూల్‌లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఆటలో కొత్త నిబంధన తీసుకువచ్చినప్పుడు లాభాలతో పాటు కొన్ని నష్టాలు ఉన్నాయన్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022-23 సీజన్ సందర్భంగా ఇంపాక్ట్ రూల్‌ను తొలిసారి అమలు చేసి పరీక్షించింది బీసీసీఐ. తొలిసారి దీన్ని ఐపీఎల్ 2023లో ప్రవేశ పెట్టింది. ఆరంభంలో కాస్త ఇబ్బందులు పడినప్పటికీ ప్రస్తుతం అన్ని జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సమర్థవంతంగా వాడుకుంటున్నాయి.
DC vs SRH : సన్‌రైజర్స్ బ్యాటింగ్ పై ఫన్నీ మీమ్స్.. బ్లూ జెర్సీ చూస్తే హెడ్‌కు పూనకం