Dinesh Karthik : ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ అరుదైన ఘ‌న‌త‌.. ధోని, రోహిత్ త‌రువాత అత‌నే..

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు దినేశ్ కార్తీక్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Dinesh Karthik : ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ అరుదైన ఘ‌న‌త‌.. ధోని, రోహిత్ త‌రువాత అత‌నే..

Karthik becomes 3rd player after Dhoni and Rohit to play 250 IPL matches

Updated On : April 21, 2024 / 4:49 PM IST

Dinesh Karthik 250 IPL matches : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు దినేశ్ కార్తీక్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాత్ర‌మే ఈ మైలురాయిని సాధించ‌గా తాజాగా డీకే సైతం దీన్ని చేరుకున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 250వ మ్యాచ్ ఆడిన మూడో ఆట‌గాడిగా దినేశ్ కార్తీక్ రికార్డుల‌కు ఎక్కాడు. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్ డీకే కెరీర్‌లో 250వ ఐపీఎల్ మ్యాచ్ కావ‌డం విశేషం.

ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచులు ఆడిన ఆట‌గాళ్లు వీరే..
ఎంఎస్ ధోని (చెన్నై సూప‌ర్ కింగ్స్‌) – 257 మ్యాచులు
రోహిత్ శ‌ర్మ (ముంబై ఇండియ‌న్స్‌) – 250 మ్యాచులు
దినేశ్ కార్తీక్ (రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు) – 250 మ్యాచులు
విరాట్ కోహ్లి (రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు) – 245 మ్యాచులు
ర‌వీంద్ర జ‌డేజా (చెన్నై సూప‌ర్ కింగ్స్‌) – 233 మ్యాచులు

DC vs SRH : స‌న్‌రైజ‌ర్స్ బ్యాటింగ్ పై ఫ‌న్నీ మీమ్స్‌.. బ్లూ జెర్సీ చూస్తే హెడ్‌కు పూన‌కం

కాగా.. దినేశ్ కార్తీక్ 2008 ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతూ వ‌స్తున్నాడు. 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ త‌రుపున ఐపీఎల్‌లో అడుగు పెట్టిన కార్తీక్ వివిధ జ‌ట్ల త‌రుపున అన్నీ సీజ‌న్ల‌లోనూ ఆడాడు. విశేషం ఏమిటంటే అత‌డు 16 సీజ‌న్ల‌లో కేవ‌లం రెండు మ్యాచుల‌కు మాత్ర‌మే దూరం అయ్యాడు. 249 మ్యాచ్‌లలో 26.6 స‌గ‌టుతో 135 స్ట్రైక్‌రేటుతో 4,742 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 97 నాటౌట్‌.

Mohammad Rizwan : కోహ్లి ఐపీఎల్‌లో బిజీ.. ఇదే అదునుగా విరాట్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టే ప‌నిలో పాక్ ఆట‌గాళ్లు..