Akash Ambani : ముంబై ఇన్నింగ్స్ మధ్యలోనే వెళ్లిపోయిన ఆకాశ్ అంబానీ.. వెళ్తూ వెళ్తూ సైగలు చేశాడు చూడండి.. వామ్మో..
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ మధ్యలోనే ఆకాశ్ అంబానీ (Akash Ambani) మైదానాన్ని వీడాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 24, 2026 / 02:45 PM IST
IPL 2026 Akash Ambani walked off in the middle of MI innings against CSK
- గురువారం వాంఖడే వేదికగా చెన్నై, ముంబై మధ్య మ్యాచ్
- తమ జట్టు వికెట్లు కోల్పోతుండడంతో ముంబై ఇన్నింగ్స్ మధ్యలోనే మైదానాన్ని వీడిన ఆకాశ్ అంబానీ
- ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై
- పరుగుల పరంగా ముంబైకి ఇదే అతి పెద్ద ఓటమి
Akash Ambani : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
సంజూ శాంసన్ (101; 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రెవిస్ (21)లు పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్, అశ్వని కుమార్ లు చెరో రెండు, జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత తిలక్ వర్మ (37; 29 బంతుల్లో 5 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (36; 30 బంతుల్లో 5 ఫోర్లు) రాణించినప్పటికి మిగిలిన వారు ఘోరంగా విఫలం కావడంతో 208 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. చెన్నై బౌలర్లలో అకేల్ హోసేన్ నాలుగు, నూర్ అహ్మద్ రెండు, ముకేశ్ చౌదరి, అన్షుల్ కాంబోజ్, జామీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆకాశ్ అంబానీ అసహనం..
ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ మధ్యలో ఆకాశ్ అంబానీ తీవ్ర అసహనానికి గురి అయ్యారు. వరుసగా వికెట్లు కోల్పోతూ ముంబై ఓటమి దాదాపుగా ఖరారు అయిన సమయంలో స్టేడియంలో తాను కూర్చున్న చోటు నుంచి లేచి.. అంతా అయిపోయింది.. ఇంకేం చూస్తారు పదండి అన్నట్లుగా స్టేడియంలోని ప్రేక్షకులకు సైగ చేస్తూ ఆయన మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nah, Akash Ambani walked off in the middle of MI’s innings yesterday and asked the crowd to leave too 😭😭🤣🤣 pic.twitter.com/TW08hbU4K8
— ; (@171off90) April 24, 2026
ఐపీఎల్ చరిత్రలోనే పరుగుల పరంగా ముంబైకి ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం.
