IPL 2026: ఎట్టకేలకు బోణీ కొట్టిన చెన్నై.. ఢిల్లీపై విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.

  • Published On : April 11, 2026 / 11:29 PM IST

IPL 2026: ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బోణీ కొట్టింది. ఈ సిరీస్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై విజయదుంధుబి మోగించింది. 23 రన్స్ తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది చెన్నై. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. 213 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ 189 పరుగులకే ఆలౌట్ అయ్యింది. చెన్నై బ్యాటర్ సంజూ శాంసన్ సెంచరీతో కదం తొక్కాడు. 56 బంతుల్లోనే 115 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ సీజన్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీతో మెరిశాడు. 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో ఓవర్టన్ 4 వికెట్లతో, కాంబోజ్ 3 వికెట్లతో చెలరేగారు. ఈ సీజన్ లో వరుసగా మూడు ఓటుముల తర్వాత చెన్నై గెలుపు సాధించింది. ఢిల్లీకి ఇది వరుసగా రెండో ఓటమి. 4 మ్యాచులు ఆడిన ఢిల్లీ 2 మ్యాచుల్లో ఓడిపోయింది.