IPL 2026: ఉర్విల్ సెన్సేషనల్ బ్యాటింగ్.. లక్నోపై చెన్నై విజయం

  • Updated on- May 10, 2026 / 07:46 PM IST

IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 204 రన్స్ టార్గెట్ ను చెన్నై మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 5 వికెట్ల తేడాతో లక్నోని చిత్తు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఉర్విల్ పటేల్ సంచలన బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 23 బంతుల్లో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. మొత్తం 8 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్ లో చెన్నైకి ఇది హ్యాట్రిక్ విజయం.